ట్రంప్ కోసం బియ్యం గింజల ఆర్టిస్టు స్పెషల్ గిఫ్ట్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. పర్యటన సందర్భంగా బియ్యం గింజల ఆర్టిస్టు వెంకటేశ్ శ్యానువోగ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. సోమవారం నుంచి రెండు రోజులు పర్యటనలో ఉండనున్న ట్రంప్‌కు వందల్లో బహుమతులు రావడం సహజమే. వాటన్నిటి కంటే భిన్నంగా ఉండేలా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 3సైజ్ పేపర్ మీద.. బియ్యం గింజలతో ఆర్ట్ వర్క్ 5వేల బియ్యం గింజలతో తయారుచేసి ట్రంప్-మోడీ కలిసి ఉన్నట్లుగా ఫొటోను ఇవ్వనున్నాడట. 

గతంలో ఏ లీడర్‌కు ఇలాంటి ఆర్ట్ వర్క్ ఇవ్వలేదు. అందుకే అమెరికా ప్రెసిడెంట్ ఇది ఇద్దామనుకుంటున్నా. కుదిరితే పర్సనల్ గా కలిసి ట్రంప్ కు అందచేద్దామని.. లేనిపక్షంలో యూఎస్ ఎన్వాయ్‌కు ఇస్తానని అనుకుంటున్నాడట. ఒక్కడే చేయాల్సి వస్తే 15నుంచి 20రోజుల సమయం పడుతుందని.. గ్రూపు సహకారంతో 2రోజుల్లో పూర్తి చేసేయగలనని అంటున్నాడు. 

కాఫీ గింజల వ్యాపారి అయిన వెంకటేశ్.. తనకున్న పాషన్ మేరకే బియ్యం గింజల ఆర్టిస్టుగా మారాడు. కొన్నేళ్ల నుంచి ఇదే పనిలో ఉన్న ఈయన ఒక్క గింజపై 578అంశాలను ప్రస్తావించగలడు. 

సోమవారం భారీ ఆశలతో ట్రంప్ భారత్‌కు రానున్నారు. పది మిలియన్ ప్రజలతో సభ ఏర్పాటు చేస్తానని మోడీ మాటిచ్చారని దాని కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నట్లు పలుమార్లు చెబుతూనే ఉన్నారు. ఆయన రాకకోసమే మోటేరా క్రికెట్ స్టేడియంను సిద్ధం చేసిన మోడీ అక్కడా లక్ష మంది ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది.