Rishi Sunak: ప్రధాని పదవికి అతి చేరువలో రిషి సునాక్

బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ 118 ఓట్లు దక్కించుకుని నాలుగో రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి అతి చేరువలో ఉన్నారు. మూడో రౌండ్‌లో 115 ఓట్లతో ఉండగా జులై 19న జరిగిన నాలుగో రౌండ్‌లో 118 ఓట్లతో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు.

 

Rishi Sunak: బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ 118 ఓట్లు దక్కించుకుని నాలుగో రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి అతి చేరువలో ఉన్నారు. మూడో రౌండ్‌లో 115 ఓట్లతో ఉండగా జులై 19న జరిగిన నాలుగో రౌండ్‌లో 118 ఓట్లతో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే ట్రేడ్ మినిష్టర్ పెన్నీ మోర్డాంట్ 92ఓట్లతో ఫారిన్ సెక్రటరీ లిజ్ ట్రస్ 86ఓట్ల ఓట్లతో నిలిచారు.

మిగిలిన ముగ్గురు అభ్యర్థులు బుధవారం తుది రౌండ్ ఓటింగ్‌లోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు దేశవ్యాప్తంగా టోరీ పార్టీ సభ్యుల మద్దతు కోసం ప్రచారంలో పాల్గొంటారు.

భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ, ఇప్పుడు 118 మంది ఎంపీల మద్దతుతో దూసుకెళ్తున్నారు. చివరి ఇద్దరి కంటే భారీ ఆధిక్యం సాధించడంతో దాదాపు ప్రధాని పదవికి చేరువైనట్లే కనిపిస్తుంది. అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి సెప్టెంబర్ 5న కొత్త కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఎన్నికవుతారు.

Read Also: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తోన్న రిషి

అనేక కుంభకోణాలు, రికార్డు సంఖ్యలో రాజీనామాలు బోరిస్ జాన్సన్ పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితిలోకి నెట్టేశాయి. యాదృచ్ఛికంగా, సునాక్‌తో ఓడిపోతున్న టోరీ అభ్యర్థులను జాన్సన్ తన మాజీ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్‌కు మద్దతు ఇవ్వవద్దంటూ పావులు కదుపుతున్నారు.

సౌతాంప్టన్‌లో జనరల్ ప్రాక్టీషనర్ తండ్రి, ఫార్మసిస్ట్ తల్లి సంతానమే రిషి సునాక్. అతను యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుండి మొదటిసారిగా 2015లో MPగా ఎన్నికయ్యారు. సునాక్ కన్జర్వేటివ్ పార్టీ శ్రేణుల ద్వారా ఎదిగి 2020లో జాన్సన్ ద్వారా అత్యంత ముఖ్యమైన UK క్యాబినెట్ పోస్ట్ – ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్‌గా నియమితులయ్యారు.

ట్రెండింగ్ వార్తలు