×
Ad

Italy Robbery: కాల్పులు, పేలుళ్లు, చేజింగ్‌లు.. ఇటలీలో హాలీవుడ్ సినిమా రేంజ్‌లో భారీ దోపిడీ.. వణుకు పుట్టించే వీడియో

హైవేపై కోట్ల రూపాయల డబ్బుతో వెళ్తున్న ట్రక్కును ఆపారు. పేలుడు పదార్దాలతో పేల్చేశారు. నిమిషాల వ్యవధిలో కోటాది రూపాయల డబ్బుతో ఉడాయించారు

  • Published On : February 10, 2026 / 10:31 PM IST

Italy Robbery Representative Image (Image Credit To Original Source)

  • ఇటలీలో భారీ దోపిడీ
  • ట్రక్ ను పేల్చేసి కోట్ల రూపాయలో చోరీ
  • తుపాకులతో కాల్పులు, బాంబు పేలుళ్లు
  • యాక్షన్ థ్రిల్లర్ ను తలపించిన దోపిడీ దృశ్యాలు

Italy Robbery: హాలీవుడ్ సినిమాల్లో ఫైటింగ్, చేజింగ్, రాబరీ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సీన్లు చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. సరిగ్గా అదే తరహా సీన్లు ఇటలీలోని రోడ్లపై కనిపించాయి. అక్కడ సినిమా స్టైల్ లో భారీ చోరీ జరిగింది. దీంతో వాహనదారులు షాక్ కి గురయ్యారు. సినీ ఫక్కీలో జరిగిన దోపిడీని కళ్లారా చూసి వారి మైండ్ బ్లాక్ అయ్యింది.

ఇటలీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. భారీ చోరీకి పాల్పడ్డారు. కోట్ల రూపాయలు దోచుకెళ్లారు. పోలీసు దుస్తుల్లో వచ్చిన దొంగలు.. తుపాకులు, పేలుడు పదార్ధాలతో కలకలం రేపారు. కోట్లాది రూపాయల డబ్బును తరలిస్తున్న ట్రక్ పై మెరుపు దాడికి దిగారు. పేలుడు పదార్ధాలతో ట్రక్ డోర్ ను పేల్చేశారు. నిమిషాల వ్యవధిలో కోట్లాది రూపాయల డబ్బుతో అక్కడి నుంచి ఉడాయించారు. హాలీవుడ్‌ సినిమాల్లోని దృశ్యాలను తలపించే రీతిలో ఈ భారీ దొంగతనం జరిగింది. ఈ చోరీకి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆరుగురు దొంగల ముఠా ముసుగులు వేసుకుని వచ్చారు. వారి దగ్గర అత్యాధునిక గన్స్ ఉన్నాయి. హైవేపై కోట్ల రూపాయల డబ్బుతో వెళ్తున్న ట్రక్కును అడ్డగించారు. ముఠాలోని కొందరు దొంగలు పోలీస్ డ్రెస్ లో ఉన్నారు. ట్రక్కును ఆపిన దొంగలు గన్లతో గాల్లోకి కాల్పులు జరిపారు. తర్వాత శక్తిమంతమైన పేలుడు పదార్దాలు పేల్చారు. ఆ పేలుడు ధాటికి ట్రక్కు పైకప్పు, తలుపులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత లోపల ఉన్న కోట్ల రూపాయల డబ్బును వాళ్ల కారులోకి మార్చుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.

ఆటోమేటిక్ గన్స్, శక్తిమంతమైన పేలుడు పదార్దాలు..

దొంగల దగ్గర ఆటోమేటిక్ ఆయుధాలు ఉన్నాయి. పోలీసులు అనిపించేలా వారి దుస్తుల్లో, పోలీసుల వాహనాన్ని తలపించే కారులో దొంగలు వచ్చారు. తీరప్రాంత పట్టణం పుగ్లియాలో సోమవారం తెల్లవారుజామున ఈ భారీ చోరీ జరిగింది. డబ్బతో ఉన్న ట్రక్ ను అడ్డగించిన దొంగలు.. అది ముందుకు వెళ్లకుండా తమ కారుని అడ్డుగా పెట్టేశారు. తర్వాత గన్నులు, పేలుడు పదార్ధాలతో కిందకు దిగారు. ఒక్కసారిగా కాల్పులు జరగడం, పేలుళ్లు చోటు చేసుకోవడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నడి రోడ్డుపై జరిగిన ఈ భారీ దోపిడీ దృశ్యాలను కొందరు వాహనదారులు రికార్డ్ చేశారు. దాంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. చోరీ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దోపిడీ దొంగలను వెంబడించారు. దొంగల ముఠాలో ఇద్దరిని పట్టుకోగలిగారు.

ఇటలీలో ఇలాంటి చోరీలు చాలా కామన్ గా మారాయి. మరీ ముఖ్యంగా పుగ్లియాలో. దోపిడీల్లో ఈ ప్రాంతం రెండో ప్లేస్ లో ఉంది. గత నాలుగేళ్ల వ్యవధిలో ఇలాంటి దోపిడీలతో 17 వేల కోట్ల రూపాయలు దోచుకెళ్లినట్లు పోలీసుల నివేదికలు చెబుతున్నాయి.