Russia-Ukraine War: యుక్రెయిన్ టూ తిరుపతి ఎయిర్‌పోర్ట్
కొద్ది వారాలుగా నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం నుంచి భారత విద్యార్థులు ఎట్టకేలకు బయటపడుతున్నారు. ఆదివారం చేరుకున్న తొలి బ్యాచ్ లో సాయి ప్రవీణ్, కావ్య శ్రీ అనే ఇద్దరు తెలుగు...
- Subhan Ali Shaik
- Published On : February 27, 2022 / 03:29 PM IST
Ukraine
Russia-Ukraine War: కొద్ది వారాలుగా నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం నుంచి భారత విద్యార్థులు ఎట్టకేలకు బయటపడుతున్నారు. ఆదివారం చేరుకున్న తొలి బ్యాచ్ లో సాయి ప్రవీణ్, కావ్య శ్రీ అనే ఇద్దరు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వాళ్లు మెడిసిన్ చదువును అర్ధాంతరంగా ఆపేసి రావాల్సి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వాల సహకారంతోనే తాము రాగలిగామని వెల్లడించారు.
‘యుక్రెయిన్ లోని మేము ఉండే ప్రాంతంలో యుద్ధం ప్రభావం అంతగా లేదు. వెస్టర్న్ సైడ్ యుక్రెయిన్‌లో యుధ్ధ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మా యూనివర్సిటీ రుమేనియా బోర్డర్‌కు దగ్గర ఉండటంతో త్వరగా రాగలిగాం. కొన్ని వేల మందికి పైగా భారత విద్యార్ధులు అక్కడే ఉండిపోయారు’
‘అక్కడ పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. యుక్రెయిన్‌లో చిక్కుక్కున్న విద్యార్ధులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు వేగంగా జరగాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు మరువలేం.
Read Also : తగ్గేదే లే…అంటున్న యుక్రెయిన్ ప్రజలు
‘అర్దాంతరంగా కాలేజీలు, చదువులు వదిలేసి రావల్సి వచ్చింది. విద్యార్థులు భవిష్యత్ గురించి ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాం’ అని ల్యాండ్ అయిన తర్వాత ప్రవీణ్, కావ్య వెల్లడించారు.
మదనపల్లి వాసి అయిన ప్రవీణ్ ఎయిర్ పోర్టులో తల్లిదండ్రులను కలిసి నేరుగా స్వగ్రామానికి బయల్దేరాడు.
