Russia – Ukraine Tensions Live Updates: రష్యా – యుక్రెయిన్ వార్ టెన్షన్స్ – లైవ్ అప్ డేట్స్

రష్యా - యుక్రెయిన్ మధ్య వార్ టెన్షన్ - లైవ్ అప్ డేట్స్

War Tensions Live Updates

Russia – Ukraine Tensions Live Updates: యుక్రెయిన్ విషయంలో.. రష్యా కీలకమైన అడుగులు వేస్తోంది. యుద్ధం తప్పదన్న సంకేతాలు స్పష్టంగా ఇస్తోంది. ఇప్పటికే.. యుక్రెయిన్ లోని వేర్పాటువాద ప్రాంతాలకు ప్రత్యేక దేశాల హోదా కల్పిస్తూ.. రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టంపై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. మరోవైపు.. యుక్రెయిన్ రాజధాని వైపు తన బలగాలను రష్యా వేగంగా కదిలిస్తోందన్న సంకేతాలు సైతం వెలువడుతున్నాయి. రష్యా తీరును అమెరికా తప్పుబట్టింది. భారత్ కూడా.. రష్యా బలగాల కదలికలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. యుక్రెయిన్ లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానాలను పంపిస్తోంది.. భారత ప్రభుత్వం.