Samsung Layoffs: శాంసంగ్ ఉద్యోగులకు షాక్.. భారీగా ఉద్యోగాల కోత.. 400 మందికి పైగా..

ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ (Samsung Layoffs)ఎలక్ట్రానిక్స్ అమెరికాలో తన వ్యాపార వ్యూహాలను మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

Samsung massive layoffs at Texas headquarters.

  • శాంసంగ్ అమెరికా ప్రధాన కార్యాలయం
  • న్యూజెర్సీ నుండి టెక్సాస్‌కు మార్పు
  • వందలాది మంది ఉద్యోగుల తొలగింపు

Samsung Layoffs: ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికాలో తన వ్యాపార వ్యూహాలను మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థాగత పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా న్యూజెర్సీలోని తన ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పెను మార్పుల కారణంగా వందలాది మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోవాల్సి వస్తోంది.

Tammineni Sitaram: కోట్ల రూపాయల భూమి కబ్జా.. మాజీ స్పీకర్ తమ్మినేనిపై కేసు నమోదు.. 8 మంది అరెస్ట్!

కంపెనీ నివేదికల ప్రకారం.. ప్రధాన కార్యాలయాన్ని న్యూజెర్సీలోని ఎంగిల్‌వుడ్ క్లిఫ్స్ నుండి టెక్సాస్‌లోని ప్లానో నగరానికి తరలిస్తున్నారు. ఈ బదిలీ ప్రక్రియ వల్ల సుమారు 739 మంది ఉద్యోగులపై నేరుగా ప్రభావం పడింది. వీరిలో చాలా మందికి టెక్సాస్‌కు మారే అవకాశం కల్పించినప్పటికీ, స్థానచలనానికి ఇష్టపడని వారిని విధులనుండి తొలగించారు. దీనికి తోడు టెక్సాస్ మొబైల్ విభాగంలో మరో 100 మందిని తీసివేయడంతో శాంసంగ్‌లో లేఆఫ్స్ కలకలం రేపాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మారుతున్న ఆధునిక టెక్నాలజీ మార్కెట్‌కు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు శాంసంగ్ (Samsung Layoffs)స్పష్టం చేసింది. వేర్వేరు బృందాలను ఒకే చోటికి చేర్చడం ద్వారా పనితీరును మెరుగుపరచడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇది ప్రపంచవ్యాప్త ఉద్యోగాల కోత కాదని, కేవలం అమెరికా మార్కెట్ ప్రాధాన్యతలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమేనని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.