AI Vaccine : వైద్య రంగంలో కొత్త విప్లవం.. ఏఐ సాయంతో వ్యాక్సిన్.. ఇక, ఏ వైరస్‌లు మనల్ని ఏమీ చేయలేవు..! ఎలా పనిచేస్తుందంటే?
AI Vaccine : వైద్య రంగంలో కొత్త విప్లవం ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైద్యరంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఏఐ సహాయంతో రూపొందించిన వ్యాక్సిన్ మానవ పరీక్షల దశలోకి అడుగు పెట్టింది.
- Harish Thanniru
- Updated on- June 6, 2026 / 12:34 PM IST
Scientists Develop Worlds First Vaccine Designed By AI
- వైద్య రంగంలోకి కొత్త విప్లవం
- ఏఐ రూపొందించిన ప్రపంచపు తొలి వ్యాక్సిన్
- ఇక, ఏ వైరస్‌లు మనల్ని ఏమీ చేయలేవు..!
AI Vaccine : వైద్య రంగంలో కొత్త విప్లవం ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైద్యరంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఏఐ సహాయంతో రూపొందించిన వ్యాక్సిన్ మానవ పరీక్షల దశలోకి అడుగు పెట్టింది. అనేక రకాల వైరస్‌ల నుంచి రక్షణ కల్పించగల, మహమ్మారిలను అడ్డుకోగల ఓ కొత్త వ్యాక్సిన్‌ను ఏఐ ఉపయోగించి అభివృద్ధి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, ఇది భవిష్యత్తులో వ్యాక్సిన్ అభివృద్ధి విధానాన్ని పూర్తిగా మార్చగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Also Read : Sahara Desert Tragedy : ఘోర విషాదం.. ఎడారిలో చెడిపోయిన ట్రక్కు.. నీరు దొరక్క 49 మంది మృతి..
సాంప్రదాయ పద్దతుల్లో ఒక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి సాధారణంగా అనేక సంవత్సరాలు పడుతుంది. వైరస్‌ను గుర్తించడం, దానికి వ్యతిరేకంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని ఎలా ప్రేరేపించాలనే అంశాలను అధ్యయనం చేయడం, ప్రయోగాలు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం వంటి ప్రక్రియలకు చాలా సమయం పడుతుంది. కానీ, ఏఐ సహాయంతో వ్యాక్సిన్‌ను వేగంగా తయారు చేసే అవకాశం ఉంటుంది.
వివరంగా చెప్పాలంటే.. సాధారణంగా ఒక వైరస్ వ్యాప్తి చెందిన తరువాతే ఆ వైరస్‌ను కట్టడి చేసేందుకు విరుగుడుగా వ్యాక్సిన్ తయారు చేస్తారు. కానీ, ఈ కొత్త పరిశోధనల్లో ఏఐ అల్గారిథమ్‌లను ఉపయోగించారు. ఈ ఏఐ వ్యవస్థ ప్రకృతిలో ఉన్న వివిధ రకాల వైరస్‌ల జన్యు క్రమాలను, అవి ఎలా పరిణామం చెందుతాయో ముందే విశ్లేషిస్తుంది. ఈ విశ్లేషణ ఆధారంగా, భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న వైరస్‌ల నిర్మాణాన్ని ఏఐ ముందే ఊహించి, దానికి సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యాక్సిన్ డిజైన్‌ను కంప్యూటర్‌లోనే సిద్ధం చేస్తుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే..? ఏఐ వ్యాక్సిన్ కేవలం ఒక నిర్దిష్ట వైరస్ ను మాత్రమే కాకుండా.. ఆ వైరస్ కుటుంబానికి చెందిన అన్ని రకాల వైరస్ లను సమర్ధవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వైరస్‌లు తమ రూపాన్ని మార్చుకున్నప్పటికీ (Variants), ఈ వ్యాక్సిన్ వాటిపై సమాన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు.
కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. టీకాకు సంబంధించిన కీలక భాగాన్ని ఏఐ రూపొందించడం, దాన్ని ప్రజలపై ప్రయోగించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఏఐ సహాయంతో రూపొందించిన టీకా ప్రస్తుతం అభివృద్ధి దశల్లో ఉంది. అయితే, భవిష్యత్తులో కరోనా వైరస్‌ల వివిధ రూపాంతరాలు మాత్రమే కాకుండా, కొత్త మహమ్మారులకు కారణమయ్యే వైరస్‌లను కూడా ఎదుర్కొనే సామర్థ్యం దీనికి ఉండొచ్చునని భావిస్తున్నారు.
ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రొఫెసర్ జొనాథన్ హీనే మాట్లాడుతూ.. ఇన్‌ఫెక్షన్లను గుర్తించి, దానిపై మన శరీరం పోరాడే అవకాశాలను వ్యాక్సిన్లు పెంచుతాయి. అయితే, కొవిడ్, చలికాలంలో సోకే ప్లూలకు సంబంధించిన వ్యాక్సిన్లను నిరంతరం అప్‌డేట్ చేస్తుండాలి. మనం ఎప్పుడూ వైరస్‌ల కంటే ఒక అడుగు వెనకబడే ఉంటున్నాం. దాన్ని అధిగమించేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. కొత్తగా వృద్ధిచెందే వైరస్‌లను, భవిష్యత్ మహమ్మారుల నుంచి రక్షించగల వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు
