Scientists Heal Wounds Without Scar Tissue
Scientists heal wounds scar tissue : సాధారణంగా ఏదైనా గాయమైనప్పుడు ఆ చోట చర్మంపై మచ్చ పడుతుంది. సర్జరీ వంటి సమయాల్లోనూ కోత కోసిన చోట మచ్చలా ఏర్పడుతుంది. చర్మం దెబ్బతిన్న ప్రాంతంలో సహజంగానే మచ్చలు ఏర్పడుతుంటాయి. అయితే ఈ మచ్చలను నయం చేసే అద్భుతమైన ఔషధాన్ని కనిపెట్టారు సైంటిస్టులు. మచ్చ కణజాలం చుట్టుపక్కల ఉన్న కణజాలం కంటే భిన్నమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ముఖంతో పాటు బయటకు కనిపించే శరీర భాగాలపై మచ్చలను నయం చేసే ఔషధాన్ని గుర్తించినట్టు సైంటిస్టులు పేర్కొన్నారు. చర్మంపై మచ్చ పడకుండా లోతైన గాయాలను నయం చేయడం నిజంగా సాధ్యమేనని స్టాన్ఫోర్డ్ మెడిసిన్ సర్జన్ మైఖేల్ లాంగేకర్ బృందం కొత్త అధ్యయనంలో వెల్లడించింది.
అనస్థీషియా ఇచ్చిన ఎలుకలలోని గాయానికి శస్త్రచికిత్సలో నిర్దిష్ట ఔషధంతో నయం చేశారు. ఇప్పుడు ఆ చోట చర్మం పూర్తిగా సాధారణమైనదిగా కనబడుతుందని స్టాన్ఫోర్డ్ పరిశోధకులు కనుగొన్నారు. నయం చేసిన గాయంలోని వెంట్రుకలన్నీ మళ్లీ రావడం చూసి ఆశ్చర్యపోయినట్టు లాంగేకర్ చెప్పారు. చర్మంలోని సాధారణ గ్రంథులను పరీక్షించామన్నారు. చర్మంపై అనేక రకాల మచ్చలు ఉంటాయి. కానీ కణజాలం దెబ్బతిన్న చోట కొల్లాజెన్ కారణంగా మచ్చలుగా కనిపిస్తాయి. కొత్త సాధారణ చర్మాన్ని పునరుత్పత్తి చేయడం కంటే చర్మంలో ఓపెనింగ్‌ను చాలా త్వరగా మూసివేయడానికి ఈ ఔషధం సాయపడుతుందని అంటున్నారు. మచ్చ కణజాలం ఏర్పడకపోతే.. గాయాలు నెమ్మదిగా నయం అవుతాయని, ఫలితంగా అనారోగ్యానికి దారితీస్తుంది లేదా తీవ్రమైన రక్తం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
మచ్చ కణజాలం చర్మం రూపాన్ని పనితీరును తగ్గిస్తుంది. మచ్చ కణజాలానికి జుట్టు కుదుళ్లు, చెమట గ్రంథులు ఉండవు. చర్మం కంటే బలహీనంగా ఉంటుంది. తద్వారా ఉష్ణోగ్రతను కదిలించే లేదా నియంత్రించే మన శరీర సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. మచ్చ ఏర్పడే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మోచేతులను కదిలించలేరని సైంటిస్టులు చెబుతున్నారు. యాంటీబయాటిక్స్ ఆధునిక ఔషధం రాకముందు.. మచ్చ కణజాలం ప్రాణాలను రక్షించేది. ఈ రోజుల్లో ముఖం వంటి ప్రాంతాల్లో మచ్చలు ఏర్పడితే వైకల్యం, మానసిక సమస్యలకు దారితీసే అవకాశాలు ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. 1987లో, శాన్ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలోని ల్యాబరేటరీలో పోస్ట్‌డాక్‌గా ఉన్నప్పుడు.. పిండాల చర్మంపై గాయాలు మచ్చలు లేకుండా ఎందుకు నయం అవుతాయో పరిశోధించాలని లాంగేకర్ గురువు, సర్జన్ మైఖేల్ హారిసన్ కోరారు.
కొన్ని దశబ్దాలు పాటు ప్రయోగాలు చేసిన అనంతరం సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నాడు. గాయం మానిపోయే సమయంలో మచ్చలో ప్రధాన పాత్ర పోషిస్తుందని లాంగేకర్ బృందం గుర్తించింది. పిండం చర్మం జిలాటినస్ అయినందున, ప్రాథమికంగా బిగుతుగా ఉండటం కారణంగా చర్మం మచ్చ కణజాలం ఏర్పడకుండా నిరోధించవచ్చునని తెలిపింది. చివరి ప్రయోగంలో, పరిశోధకులు ఎలుకల్లో గాయాలపై శస్త్రచికిత్సా నిర్వహించారు.. వైద్యం చేసే గాయానికి యాంత్రిక ఒత్తిడిని జోడించారు. గాయం నయం అయినప్పుడు, మచ్చ కణజాలం లేకుండా పూర్తిగా సాధారణమైనదిగా అనిపించింది. భవిష్యత్తులో పరిశోధకులు మానవులలో క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.