మరుగుజ్జు జిరాఫీలను ఫస్ట్ టైం గుర్తించిన సైంటిస్టులు

Scientists Report First Instances of Dwarf Giraffes : పొడవైన మెడ, కాళ్లు.. భారీ శరీరంతో జిరాఫీలను చూసి ఉంటారు. మరుగుజ్జు జిరాఫీలీను ఎప్పుడైనా చూశారా? ఫస్ట్ టైం పొట్టి జిరాఫీలను సైంటిస్టులు గుర్తించారు. సాధారణంగా జిరాఫీలు 9 అడుగుల ఎత్తుకు, 4 అంగుళాల పొడవుకు పెరుగుతుంటాయి. ఉగాండాలోని ముర్చిసన్ ఫాల్స్ నేషనల్ పార్క్‌లో పరిరక్షణ జీవశాస్త్రజ్ఞుల బృందం క్రమం తప్పకుండా సర్వేలు చేస్తుంటారు. నూబియన్ జిరాఫీని గమనించిన సైంటిస్టులు సాధారణ జిరాఫీలకు ఈ జిరాఫీల మధ్య వ్యత్యాసం ఉందని గుర్తించారు. పొడవాటి, సన్నని కాళ్లకు బదులుగా జిరాఫీ చిన్న మెడ, బలిష్టమైన కాళ్లతో కనిపించిందని రిపోర్టు నివేదించింది.

Gimli అనే జిరాఫీలు 9 అడుగుల ఎత్తు, 4 అంగుళాల పొడవు పెరుగుతుంది. సగటు వయస్సు జిరాఫీల కంటే చాలా అడుగులు తక్కువగా చెప్పవచ్చు. సుమారు ఈ జాతి జిరాఫీలు 16 అడుగుల వరకు పెరుగుతుంది. మూడు ఏళ్ల తరువాత, నమీబియాలోని పార్కులో 8.5 అడుగుల పొడవైన అంగోలాన్ జిరాఫీని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ మరుగుజ్జు జిరాఫీకి ‘నిగెల్’ అని పేరు పెట్టింది సైంటిస్టుల బృందం. లేజర్‌ను ఉపయోగించే ఫోటోగ్రామెట్రీని ఉపయోగించి.. శాస్త్రవేత్తలు గిమ్లీ, నిగెల్ తక్కువ మెటాకార్పల్స్ కలిగి ఉన్నాయని కనుగొన్నారు. వరుసగా మోకాళ్ల కింద పైన ఉన్న ఎముకల పరిమాణాలను నివేదించారు.

ఈ నిగెల్ అనే మరుగుజ్జు జిరాఫీ.. ఇంకా బాల్యంలోనే ఉందని పూర్తిగా ఎదిగిన మగ జిరాఫీ కాదని అంటున్నారు. నమీబియా, నిగెల్ జిరాఫీతో కలిసి తిరుగుతున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. ఇతర జిరాఫీలతో పోల్చితే.. ఈ రకం జిరాఫీలు చాలా పొట్టిగా ఉన్నాయని అంటున్నారు. జిరాఫీ కన్జర్వేషన్ ఫౌండేషన్ ప్రకారం.. మరుగుజ్జు జిరాఫీలు లేదా అడవి జిరాఫీలలో గుర్తించడం ఇదే మొదటిసారి.

దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఫలితాలను డిసెంబరులో బీఎంసీ రీసెర్చ్ జనరల్‌లో ప్రచురించారు. అస్థిపంజర డైస్ప్లాసియాగా పిలిచే మరుగుజ్జు, ఎముక మృదులాస్థి పెరుగుదలను ప్రభావితం చేసే ఒక జన్యు పరిస్థితిగా కనుగొన్నారు. ఈ రకమైన అస్థిపంజర డైస్ప్లాసియాస్ ఉన్న అడవి జంతువులు చాలా అరుదుగా ఉంటాయని తెలిపారు. ఉగాండాలోని ఫాల్స్ నేషనల్ పార్క్ జిరాఫీ జనాభా 1980 చివరలో వేటాడటం వల్ల గణనీయంగా తగ్గింది. అప్పటినుంచి జిరాఫీల జనాభా 1,500కు పైగా ఉన్నట్టు అంచనా.