సెప్టెంబర్ 9 రూత్ ప్ఫౌ పుట్టినరోజు. పాకిస్థాన్ మదర్ థెరిస్సాగా పేరొందిన డాక్టర్ రూత్ కేథరీనా మార్తా ప్ఫౌకు గూగుల్ డూడుల్ నివాళి అర్పించింది. తన దేశం కాకపోయినా పాకిస్థాన్ లో కుష్టువ్యాధిగ్రస్తులకు రూత్ ప్ఫౌ ఎనలేని సేవ చేశారు.ఆమె డాక్టరే కాదు డాటర్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మేరీ సొసైటీ సన్యాసిని. 1929,సెప్టెంబర్ 9న జర్మనీలోని లీప్ జిగ్ లో జన్మించారు.
పాకిస్తాన్‌లో కుష్టు వ్యాధిని నిర్మూలించడానికి ఆమె చేసిన అంకితభావాన్ని గూగుల్ గుర్తుచేసుకుంటూ నివాళి అర్పించింది.1961లో రూత్ ప్ఫై 31 సంవత్సరాల వయస్సులో పాకిస్థాన్ వెళ్లారు. అక్కడి కుష్ఠురోగుల దుస్థితిని చూసిన రూత్ ప్ఫా చలించిపోయారు.మానవులు ఇటువంటి పరిస్థితులలో జీవించగలరని ఈ దృశ్యాలు చూసేవరకూ నేను నమ్మలేకపోయాననీ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆనాటి నుంచి పాకిస్థాన్ లోని కుష్టు రోగుల సేవకే అంకితమైపోయారు. 1962 లో కరాచీలో మేరీ అడిలైడ్ కుష్టు వ్యాధి కేంద్రాన్ని ప్రారంభించారు. తరువాత నిధులు సేకరించి మరికొన్ని ప్రాంతాలలో కూడా కుష్టు వ్యాధి కేంద్రాలను తెరిచి వారికి ఎనలేని సేవ చేశారు.
అలా ఆమె ఒకటీ రెండూ కాదు పది ఇరవై కాదు ఏకంగా 55 సంవత్సరాల పాటు కుష్టు రోగులకు సేవలకు అంకితమైపోయారు డాక్టర్ రూత్ ప్ఫా. ఎంతోమందికి ప్రాణదానం చేశారు. పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా రూత్ ప్ఫా 157 కుష్టు వైద్యశాలల స్థాపించారు. 56,780 మందికి చికిత్సనందించారు.
కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఫిజియోథెరపీ యూనిట్లు, కృత్రిమ అవయవాలను తయారు చేసే వర్క్‌షాప్‌లు, వికలాంగుల కోసం 150 కి పైగా ఆధునిక మెడికల్ సెంటర్ల నెట్‌వర్క్‌ను నిర్మించారు. పాకిస్తాన్‌లో కుష్టు వ్యాధితో ఆమె చేసిన పోరాడటానికి తగిన ప్రతిఫలం కూడా దక్కింది. ఎంతమంది ప్రాణాల్ని కాపాడింది. అంతేకాదు..ప్రపంచ ఆరోగ్య సంస్థ 1996 లో పాకిస్తాన్ పేరును ఆసియాలో మొదటి కుష్టు దేశాలలో ఒకటిగా ప్రకటించింది.
జర్మనీ దేశస్థురాలైనా తమ దేశానికి వచ్చి కుష్టువ్యాధి గ్రస్థులకు ఆమె చేసిన సేవలకు గానీ పాకిస్తాన్ హిలాల్-ఇ-పాకిస్తాన్, హిలాల్-ఇ-ఇంతియాజ్, నిషాన్-ఇ-క్వాయిడ్-ఇ-అజామ్, సీతారా-ఇ-క్వాయిడ్-ఇ- అజామ్‌లతో వంటి పలు పలు అవార్డులతో సత్కరించింది.అంతేకాదు ఆమె చేసిన సేవలకు గానీ ఎన్నో జాతీయ అంతర్జాతీయ ప్రశంసల్ని అందుకున్నారు.
గూగుల్ డూడుల్ ఆమె చేసిన అపారమైన సేవను గుర్తించి డాక్టర్ రూత్ ప్ఫా యానిమేషన్ ఒక కుష్టు రోగిని చూసుకుంటున్నట్లుగా కరాచీకి చెందిన మేరీ అడిలైడ్ లెప్రసీ క్లినిక్ వెలుపల డాక్టర్ రూత్ ప్ఫౌ చిత్తరువును విడుదల చేసింది.