Virginia Shooting : వర్జీనియా హైస్కూల్‌లో కాల్పులు..ఏడుగురికి గాయాలు
వర్జీనియాలో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు.మంగళవారం రాత్రి హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత వర్జీనియాలోని రిచ్‌మండ్‌లోని ఆల్ట్రియా థియేటర్ వెలుపల కాల్పులు జరగడంతో ఏడుగురు గాయపడ్డారు...
- saleem sk
- Published On : June 7, 2023 / 08:02 AM IST
Virginia Shooting
Virginia Shooting : వర్జీనియాలో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు.మంగళవారం రాత్రి హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత వర్జీనియాలోని రిచ్‌మండ్‌లోని ఆల్ట్రియా థియేటర్ వెలుపల కాల్పులు జరగడంతో ఏడుగురు గాయపడ్డారని(Seven Injured) అధికారులు తెలిపారు.కాల్పులు జరిపిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని రిచ్‌మండ్ తాత్కాలిక పోలీసు చీఫ్ రిక్ ఎడ్వర్డ్స్ చెప్పారు.
Cyclone Biparjoy : పాకిస్థాన్‌లో తీరం దాటనున్న బీపర్‌జోయ్ తుపాన్…పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు
హ్యూగెనాట్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్(High School Graduation Ceremony) తర్వాత మన్రో పార్క్‌లో కాల్పులు జరిగినట్లు రిచ్‌మండ్ పబ్లిక్ స్కూల్స్ అధికారి మాథ్యూ స్టాన్లీ తెలిపారు. ఈ పార్క్ వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ క్యాంపస్‌లో థియేటర్‌కి ఎదురుగా ఉంది.
Major Train Accident Averted: డ్రైవర్ బ్రేక్ వేయడంతో తప్పిన పెద్ద రైలు ప్రమాదం
ఈ కాల్పుల ఘటనతో మరో పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకను రద్దు చేశామని స్టాన్లీ చెప్పారు. రిచ్‌మండ్ మేయర్ లెవర్ ఎం. స్టోనీ ఈ కాల్పుల ఘటనపై ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.కాల్పులు జరిగిన మన్నో పార్క్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రజలెవరూ ఈ ప్రాంతానికి రావద్దని మేయర్ స్టోనీ ట్వీట్ లో కోరారు.
