Shakira: షకీరాను అడవి పందులు కుమ్మేశాయ్..
అడవి పందులు తనను కుమ్మేశాయని షకీరానే స్వయంగా వెల్లడించింది. స్పెయిన్ లోని బార్సిలోనాలో ఈ ఘటన జరిగినట్లు సింగర్ షకీరా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
- Subhan Ali Shaik
- Published On : October 1, 2021 / 03:56 PM IST
Wild Boar
Shakira: అడవి పందులు తనను కుమ్మేశాయని షకీరానే స్వయంగా వెల్లడించింది. స్పెయిన్ లోని బార్సిలోనాలో ఈ ఘటన జరిగినట్లు సింగర్ షకీరా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతేకాకుండా కొడుకుతో కలిసి పార్క్ లో ఉన్న సమయంలో తనని కుమ్మి.. దగ్గర ఉన్న బ్యాగ్ దొంగిలించుకుపోయాయని చెప్పుకొచ్చింది.
‘ఒకసారి చూడండి. అడవి పంది నన్ను దాడి చేసి బ్యాగ్ తీసుకుని ఎలా వెళ్లిపోయిందో’ అని షకీరా ఇన్ స్టాగ్రామ్ లో రాసింది. మురికితో నిండిపోయిన బ్యాగ్ ను కూడా చూపించింది.
‘చెక్కల మధ్యలోకి నా బ్యాగ్ ను తీసుకెళ్లిపోగా అందులో నా మొబైల్ ఫోన్ కూడా ఉందని చెప్పింది. ప్రతి ఒక్కటీ నాశనం చేశాయని ఇన్‍స్ట్రాగ్రామ్ లో చెప్పింది. ఆ తర్వాత తన 8ఏళ్ల కొడుకును ఘటన గురించి చెప్పమంది. ‘మిలాన్ నిజం చెప్పు. మీ అమ్మ అడవి పందుల ముందు ధైర్యంగా ఎలా నిలబడిందో చెప్పు’ అని అందులో చెప్పింది.
బార్సిలోనాలో జరిగిన ఈ ఘటనలో ఒకరు గాయాలపాలయ్యారని అధికారులు చెప్తున్నారు. స్పెయిన్ లో అడవి పందుల తాకిడి ఎక్కువగా ఉందని 2016లో 1187 కంప్లైంట్స్ వచ్చాయి. 2013లో అటవీ శాఖ అధికారి ఒకరు అడవి పందిని షూట్ చేయబోయి తన పార్టనర్ ను షూట్ చేసేశారు.
