Snake Swallows Golf Balls : గుడ్లు అనుకుందేమో..గోల్ఫ్‌ బంతులను మింగేసిన పాము..మింగలేక కక్కలేక తిప్పలు 

కోడిగుడ్లు అనుకుందో.. ఏమోగానీ ఓపాము గోల్ఫ్ బంతుల్ని మింగేసింది. పాపం ఆ బంతులు కాస్తా పాము గొంత దిగలేదు. బయటకు రావటంలేదు. దీంతో పాపం ఆ పాము నానా తిప్పలు పడింది.

Snake Swallows Golf Balls

Snake Swallows Golf Balls : కోడిగుడ్లు అనుకుందో.. ఏమోగానీ ఓపాము గోల్ఫ్ బంతుల్ని మింగేసింది. పాపం ఆ బంతులు కాస్తా పాము గొంతు దిగలేదు. బయటకు రావటంలేదు. దీంతో పాపం ఆ పాము నానా తిప్పలు పడింది. పాము గోల్ఫ్‌ బంతులను కోడి గుడ్లనుకుని మింగేసేందుకు ప్రయత్నించింది. ఐతే అవి ఆ పాము శరీరంలో ఇరుక్కుపోయి ఉన్నాయి. దీంతో పాము నరకయాతన అనుభవించింది. ఈ ఘటన నార్త్‌ కొలరాడో వైల్డ్‌ లైఫ్‌ సెంటర్‌లో చోటు చేసుకుంది. దీంతో ఆ వైల్డ్‌లైఫ్‌ సెంటర్‌ అధికారులు స్నేక్‌ రెస్క్యూ బృందాన్ని పిలిపించగా..పాముకి శస్త్ర చికిత్స చేయకుండానే ఆ బంతులను తీసేశారు.

30 నిమిషాలు శ్రమించి ఆ పాముకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా పాము శరీరం నుంచి ఆ బంతులను తీసివేశారు. ప్రస్తుతం ఆ పాము చిన్నపాటి గాయాలతో సురక్షితంగానే ఉంది. కోలుకుంటోంది. బహుశా ఆపాముకు చాలా ఆకలిగా ఉండటంతో ఆ గోల్ఫ్‌ బంతులను చూసి గుడ్లు అనుకుని మింగేసి ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

కాగా..మనుషులు చేసే కొన్ని తప్పిదాల వల్ల ఎన్నో వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతుననాయి. బీచ్‌ల వద్ద, నదుల వద్ద పెద్ద ఎత్తున్న ప్లాస్టిక్‌ వంటి చెత్తచెదారాలను వేసేస్తాం. వాటి బారిన పడి ఎన్నో జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి.