మార్నింగ్ వాక్‌లో భార్య ముందే దారుణం, పెంపుడు సింహాలే భర్తను చంపేశాయి

  • Publish Date - August 28, 2020 / 09:35 AM IST

పెంపుడు జంతువులే అతడి పాలిట మృత్యువయ్యాయి. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న సింహాలే అతడి ప్రాణాలు తీశాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. ప్రముఖ జంతు పరిరక్షకుడు మ్యాథూసన్(69) తన పెంపుడు సింహాల చేతిలో చనిపోయాడు. మ్యాథూసన్ లింపోపో ప్రావిన్స్ లో ప్రముఖ లయన్ ట్రీటాప్ సఫారీ లాడ్జ్ నడుపుతున్నాడు. తన భార్య సాయంతో ఆయన దీన్ని నిర్వహిస్తున్నాడు. మ్యాథుసన్ దగ్గర కొన్ని సింహాలు ఉన్నాయి. వాటిని బాగా మచ్చిక చేసుకున్నాడు. సాధారణ పెంపుడు జంతువులు కుక్క, పిల్లితో ఎలా అయితే స్నేహంగా, సన్నిహితంగా ఉంటామో, అదే రీతిలో మ్యాథూసన్ మృగరాజులతో ఉండేవాడు.

మార్నింగ్ వాక్ లో దాడి చేసిన రెండు ఆడసింహాలు:
కాగా, బుధవారం(ఆగస్టు 26,2020) ఉదయం ఘోరం జరిగిపోయింది. ఎప్పటిలాగానే తన పెంపుడు సింహాలు, భార్యతో కలిసి మాథ్యూసన్ మార్నింగ్ వాక్ కి వెళ్లాడు. ఆ సమయంలో రెండు తెల్ల ఆడ సింహాలు అనూహ్యంగా మ్యాథూసన్ పై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాథ్యూసన్ స్పాట్ లోనే చనిపోయాడు. ఎమర్జెన్సీ బృందాలు వచ్చి చూసేసరికి అతడు ప్రాణాలు విడిచాడు.


https://10tv.in/tiktokceo-resigns-after-trump-administration-threatens-to-ban-the-app/
నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన భార్య:
ఈ హఠాత్ పరిణామంతో మాథ్యూ భార్య విస్తుపోయింది. ఆమె ఇంకా షాక్ లోనే ఉంది. తన కళ్ల ముందే సింహాలు తన భర్తను దాడి చేసి చంపేశాయని కన్నీరుమున్నీరు అయ్యింది. కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయానని వాపోయింది. కాగా, త్వరలోనే రెండు ఆడ సింహాలను అడవిలో వదిలేసే యోచనలో మ్యాథూ ఉన్నాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. వాటితో చాలా కఠినంగా ఆటలు ఆడించడం వల్లే అవి ఈ విధంగా దాడి చేసి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆపదలో ఉన్న సింహాలను కాపాడి తీసుకొచ్చాడు:
జంతువులను వేటాడే ప్రాంతం కేన్డ్ హంటింగ్ నుంచి ఆ సింహాలను కాపాడి తీసుకొచ్చాడు మ్యాథూసన్. వాటిని ఓ లాడ్జిలో ఎన్ క్లోజర్ లో ఉంచాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. మ్యాథుసన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మ్యాథూ మరణం జంతువుల పరిరక్షణకు తీరని లోటు అని బంధువులు చెప్పారు. మ్యాథూకి సింహాలు అంటే ప్రాణం. వాటిని ఎంతో ప్రేమగా చూసుకునే వాడు. అలాంటి వ్యక్తి చివరకు వాటి చేతిలోనే చనిపోవడం బాధాకరం అని స్థానికులు వాపోయారు.

గతంలోనూ ఓ వ్యక్తిపై దాడి చేసిన సింహం:
కాగా, మాథ్యూపై దాడి చేసి చంపిన రెండు ఆడ సింహాల్లో ఒకటి.. గతంలోనూ 2017లో ఇలానే ఓ వ్యక్తిపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని వారాల తర్వాత చనిపోయాడు. అయితే అతడి మరణానికి అనారోగ్య సమస్యలు కారణం అని అప్పట్లో వైద్యులు చెప్పారు.



ట్రెండింగ్ వార్తలు