SpiceJet flight: ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లే విమానం పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఢిల్లీ నుంచి దుబాయ్‌కు బయల్దేరిన స్పైస్‌జెట్ SG-11 విమానాన్ని సాంకేతిక లోపం ఉండటంతో కరాచీ (పాకిస్థాన్)లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ లో వెల్లడించింది.

 

 

SpiceJet Flight: ఢిల్లీ నుంచి దుబాయ్‌కు బయల్దేరిన స్పైస్‌జెట్ SG-11 విమానాన్ని సాంకేతిక లోపం ఉండటంతో కరాచీ (పాకిస్థాన్)లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ లో వెల్లడించింది.

స్పైస్‌జెట్ B737 ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ SG-11 (ఢిల్లీ-దుబాయ్) ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతో కరాచీకి మళ్లించారు. విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణికులను సురక్షితంగా దించామని స్పైస్‌జెట్ ప్రతినిధి పేర్కన్నారు.

ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని, విమానం సాధారణ ల్యాండింగ్‌ చేశామని ఆయన తెలిపారు. విమానంలో ఎటువంటి లోపం ఉన్నట్లు బయల్దేరే సమయంలో తెలియలేదు. ప్రయాణికులకు స్నాక్స్ అందించారు. ఆ తర్వాతే ఇలా జరిగింది.

Read Also: స్పైస్ జెట్ పై సోను ఫోటోతో అరుదైన గౌరవం

“ఇక్కడి నుంచి ప్రయాణికులను దుబాయ్‌కి తీసుకెళ్ళేందుకు ఓ ఆల్టర్నేటివ్ విమానం కరాచీకి పంపనున్నాం” అని ప్రతినిధి తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు