వైరల్ వీడియో : పల్లీ కోసం కిటీకీ దగ్గర ఉడుత వెయిటింగ్..పెట్టగానే చటుక్కున తీసుకుని తుర్రుమంటోంది

  • Publish Date - November 11, 2020 / 02:26 PM IST

America Squirrel viral Video: ఉడుతలు చూడటానికి ఎంతో ముద్దుగా ముచ్చటగా బాగుంటాయి. పట్టుకుందామని ఆశగా ఉంటుంది. ఓసారి దొరికితే బాగుండనీ… వాటితో ఆడుకోవాలనీ పిల్లలకే కాదు పెద్దలకు కూడా సరదా ఉంటుంది. కానీ చిన్నపాటి అలికిడికే తుర్రుమంటాయి. చాలా యాక్టివ్ గా ఉండే ఉడుతలు మనిషి దగ్గరగా వస్తే చాలు చటుక్కుని చెట్టెక్కేస్తాయి.



కానీ ఓ ఉడుత మాత్రం…ప్రతీరోజు ఓ ఇంటి కిటీకి దగ్గరకు వెళ్లి ఓవ్యక్తి కోసం ఆశగా ఎదురు చూస్తుంటుంది. అతను పెట్టే వేరు శనగ కాయ కోసం… ఓ ఇంటి కిటికీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అతను వచ్చి ఓ వేరుశెనగ కాయ అందించగానే దాన్ని చటుక్కున తీసుకుని లటుక్కున తినేసి తుర్రుమంటుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



ఉడుతలు గింజల్ని చాలా ఇష్టంగా తింటాయి. వేరు శనగ, వాల్ నట్స్, చిక్కుడు, కాజు, బాదాం ఇలా ఏ గింజలనైనా చాలా ఇష్టంగా తింటాయి. అది కాయల్ని చక్కగా ఒలుచుకుని మరీ తింటాయి. వేరు శనగ కాయను విరగగొట్టి… అందులో పల్లీని తినడాన్ని ఉడుతలు బాగా ఎంజాయ్ చేస్తాయి. కళ్లు మూసి తెరిచేలోగా చకచకా కాయల్ని ఒలిచేసుకుని గుటుక్కుమనిపిస్తాయి. అలా ఓ ఉడుత ఓ ఇంటి కిటీకి దగ్గరకొచ్చి అతనుపెట్టే వేరు శెనగ కాయకోసం వెయిట్ చేస్తుంటుంది.





అమెరికా… ఒరెగాన్‌లోని… పోర్ట్‌లాండ్‌లో ఓ ఉడుత చక్కగా బుద్దిగా అతను వచ్చేదాకా ఎదురు చూస్తుంటుంది. ప్రతీరోజూ వెళ్లి… కిటికీ దగ్గర ఎదురుచూస్తుంది. కిటికీని టచ్ చేయకుండా అలా అక్కడే ఉంటోంది. ఉడుతను చూసి… ఆ ఇంట్లో వ్యక్తి… ఓ వేరుశనగ కాయ ఇవ్వగానే… దాన్ని అపురూపంగా తీసుకొని… తుర్రున పారిపోతోంది.




గుడ్ మార్నింగ్… నీకు మరో పీనట్ (పల్లి) కావాలా అని వీడియోలో వ్యక్తి అడుగుతూ… పీనట్ ఇస్తుంటే… ఆ ఉడుతలో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అబ్బా మేం కూడా నీకు పల్లీలు పెడతాం..మా ఇంటికి కూడా రావా అంటున్నారు నెటిజన్లు.




బుజ్జి ఉడుతలు రావాలే గానీ వేరుశెనగ కాయలేంటీ బాదం పిస్తాలు కూడా పెడతామంటున్నారు. మరి పాపం నెటిజన్ల కోరినకు ఆ ఉడుత మన్నిస్తే బాగుండు..వారి ముచ్చటా తీరుతుంది..ఆ ఉడుత బుజ్జి పొట్టా నిండుతుంది కదూ..

 

ట్రెండింగ్ వార్తలు