Buddha Statue: ఇటలీలో దొరికిన 1200ఏళ్ల నాటి ఇండియా బౌద్ధ విగ్రహం

ఇండియా నుంచి దొంగిలించిన 1200ఏళ్ల నాటి బౌద్ధ విగ్రహం బయటపడింది. మిలాన్ లోని ఇండియన్ క్యాన్సులేట్ చాలా ప్రత్యేకమైన అవలోకితేశ్వర పదమపాణి విగ్రహాన్ని రికవరీ చేసుకుంది. 20ఏళ్ల క్రితం ఇండియా నుంచి స్మగ్లింగ్ తో దూరమైన విగ్రహంగా గుర్తించారు.

Buddha Statue

Buddha Statue: ఇండియా నుంచి దొంగిలించిన 1200ఏళ్ల నాటి బౌద్ధ విగ్రహం బయటపడింది. మిలాన్ లోని ఇండియన్ క్యాన్సులేట్ చాలా ప్రత్యేకమైన అవలోకితేశ్వర పదమపాణి విగ్రహాన్ని రికవరీ చేసుకుంది. 20ఏళ్ల క్రితం ఇండియా నుంచి స్మగ్లింగ్ తో దూరమైన విగ్రహంగా గుర్తించారు.

దేవీస్థాన్ కుందల్పూర్ గుడిలో ఉండే దాదాపు 1200ఏళ్ల క్రితం విగ్రహంగా తెలుస్తుంది. 2000వ సంవత్సరానికి ముందే దీనిని దొంగిలించి, స్మగ్లింగ్ ద్వారా ఇతర దేశాలకు తరలించారు.

‘8-12వ శతాబ్దాలకు చెందిన అవలోకితేశ్వర విగ్రహం. నిలబడి ఉన్నట్లుగా విగ్రహం ఎడమ చేతిలో వికసించిన తామరతో ఉంటుంది’ అని ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది. బౌద్దిజంలో అవలోకితేశ్వర్ అనే వారు బౌద్ద సాధ్వులు.

Read Also: ఉత్తరకాశీలో ఉదయం 5గంటలకు భూకంపం

 

కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ ఆర్ట్ మార్కెట్లో ఉన్న ఈ శిల్పం ఇప్పుడు ఇటలీలోని మిలాన్ కు చేరింది. ఇండియన్ ప్రైడ్ ప్రొజెక్ట్ అయిన విగ్రహాన్ని సింగపూర్ అండ్ ఆర్ట్ రికవరీ ఇంటర్నేషనల్, విగ్రహాన్ని యథాస్థానానికి చేర్చడంలో సహకారం అందిస్తున్నారు.