Firing In School: పాఠశాలలో కాల్పులు జరిపిన ఆరో తరగతి విద్యార్థిని.
ఆరోతరగతి బాలిక తోటివిద్యారులపై గన్ తో కాల్పులు జరిపి ముగ్గురిని గాయపరిచింది. ఈ ఘటన ఇడాహోలోని రిగ్బీలో చోటుచేసుకుంది. తన స్కూల్ బ్యాగ్ లో గన్ తీసుకొని వచ్చిన బాలిక పాఠశాల హల్లో కాల్పులు జరిపింది.. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్దరు విద్యార్థులతో పాటు మరోవ్యక్తి ఉన్నారు.
- kunduru Vinod
- Published On : May 7, 2021 / 01:27 PM IST
Firing In School
Firing In School: ఆరోతరగతి బాలిక తోటివిద్యారులపై గన్ తో కాల్పులు జరిపి ముగ్గురిని గాయపరిచింది. ఈ ఘటన ఇడాహోలోని రిగ్బీలో చోటుచేసుకుంది. తన స్కూల్ బ్యాగ్ లో గన్ తీసుకొని వచ్చిన బాలిక పాఠశాల హల్లో కాల్పులు జరిపింది.. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్దరు విద్యార్థులతో పాటు మరోవ్యక్తి ఉన్నారు. గాయపడిన వారిని ఈస్టర్న్ ఇడాహో ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీరిలో ఒకరి పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరో ఇద్దరికీ సర్జరీ చెయ్యాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలను జెఫెర్సన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది. ఉదయం 9 గంటల సమయంలో బాలిక కాల్పులు జరిపినట్లు తెలిపింది. పాఠశాల హాలులో వరుసగా మూడుసార్లు కాల్పులు జరిపింది. భయంతో విద్యార్థులంతా బయటకు పరుగులు తీశారు. బాలిక చేతిలో తుపాకీని ఒక టీచర్ లాగేసుకుని పోలీసులకు అప్పగించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలికకు గన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. కాల్పుల తర్వాత పాఠశాలలోని విద్యార్థులను పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలోకి తరలించారు.
