×
Ad

Iran vs Israel war : రూ.3కోట్లు ఇస్తాం.. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోండి మహాప్రభో.. ప్రైవేట్ జెట్స్ వాళ్లకు డబ్బున్నోళ్ల ఆఫర్లు..

Iran vs Israel war : సెమాఫోర్ నివేదికల ప్రకారం.. దుబాయ్, అబుదాబీ, ఖతార్, బహ్రెయిన్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సంపన్నులు ప్రైవేట్ జెట్ విమానాలు, వాణిజ్య విమానాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు.

Iran vs Israel war

  • ఇరాన్ దాడులతో భయం గుప్పిట్లో గల్ఫ్ దేశాల్లోని విదేశీ సంపన్నులు
  • ప్రైవేట్ జెట్‌ల ద్వారా బయటపడేందుకు ప్రయత్నాలు
  • ఒక్కో ప్రైవేట్ జెట్ కోసం రూ.3.2కోట్లు చెల్లిస్తున్న వైనం

Iran vs Israel war : అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్‌సైతం ప్రతీకార దాడులు చేస్తోంది. ఒకవైపు ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇరాన్ సైన్యం.. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలు టార్గెట్‌గా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలుదేశాల్లో విమానాశ్రయాలు మూతపడటంతో వేలాదిమంది ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.

Also Read : Petrol Price : యుద్ధ ఎఫెక్ట్.. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు..! ఎంత పెరుగుతాయో తెలుసా.. వామ్మో.. దిమ్మతిరిగిపోవాల్సిందే

దుబాయ్ అంతటా ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. ఇప్పటికే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రధాన విమానాశ్రయాలు ఇరాన్ దాడులకు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండిగో, అకాసా ఎయిర్, ఖతార్ ఎయిర్‌వేస్‌తో సహా అనేక విమానయాన సంస్థలు దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాలతోపాటు మధ్యప్రాచ్యంలోని అనేక విమానాశ్రయాలకు తమ విమానాలను రద్దు చేశాయి

విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో.. దుబాయ్, అబుదాబిలోని కొంతమంది విదేశీ సంపన్నలు, స్థానిక సంపన్నులు ఇరాన్ దాడులతో బిక్కుబిక్కుమంటున్నారు. ఆ ప్రాంతాల నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వారు ప్రైవేట్ జెట్‌లలో అక్కడి నుంచి బయటపడేందుకు భారీ మొత్తంలో వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. న్యూయార్క్ పోస్టు నివేదిక ప్రకారం.. సుమారు 3.2కోట్లు చెల్లిస్తున్నారట.

దుబాయ్,అబుదాబిలలో నివసిస్తున్న స్థానికంగా ఉండే ధనవంతులు, విదేశీ సంపన్నులు ప్రైవేట్ భద్రతా సంస్థలను ద్వారా అక్కడి నుంచి త్వరగా బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపార అవసరాల నిమిత్తం, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేందుకు విదేశీయులు వేలాది మంది నిత్యం దుబాయ్, గల్ఫ్ లోని ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. లగ్జరీ హోటల్, ఇతర సంపన్న ప్రదేశాల్లో ఉంటూ తమ కార్యకలాపాల్లో నిమగ్నమవుతుంటాయి. అయితే, తాజాగా ఇరాన్ దాడులతో వారంతా వణికిపోతున్నారు. ఈ క్రమంలో కొందరు సౌదీ అరేబియాకు 10గంటలు ప్రయాణించడానికి లక్షలాది డాలర్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సౌదీ అరేబియాకు చేరుకుంటే అక్కడి నుంచి గల్ఫ్ దేశాల నుంచి బయటపడేందుకు విమాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన స్థానిక, విదేశీ సంపన్నులు రియాద్ చేరుకొని అక్కడి నుంచి భయానక పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గల్ఫ్ దేశాల్లోని యుద్ధ వాతావరణం నుంచి బయటపడాలంటే సౌదీ అరేబియా మాత్రమే ఏకైక ఎంపిక అని ప్రైవేట్ జెట్ బ్రోకరేజ్ విమానా ప్రైవేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమీర్ష్ అన్నారు.

సెమాఫోర్ నివేదికల ప్రకారం.. దుబాయ్, అబుదాబీ, ఖతార్, బహ్రెయిన్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సంపన్నులు ప్రైవేట్ జెట్ విమానాలు, వాణిజ్య విమానాల ద్వారా తమ దేశాలకు వెళ్లేందుకు రియాద్ నగరానికి దాదాపు 35 కిలో మీటర్లు దూరంలో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి లాంగ్ డ్రైవ్ చేసుకొని వెళ్తున్నారు. ఈ విమానాశ్రయం ఐదు ప్రయాణీకుల టెర్మినల్ లను కలిగి ఉంది. ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు జరుగుతున్నాయి.. అంతేకాక ప్రైవేట్ జెంట్ లు అందుబాటులో ఉన్నాయి. దీంతో సంపన్నులు విమానాశ్రయంకు చేరుకొని భారీ ఖర్చుచేసి తమ దేశాలకు వెళ్తున్నారు.