Tesla Car: ట్రాఫిక్ లో ఉన్నపుడు టెస్లా కారులో పోర్న్ చూస్తున్న “ఘనుడు”
లండన్ మహానగరంలో ట్రాఫిక్ లో చిక్కుకున్న ఒక టెస్లా కారు యజమాని పోర్న్ చూస్తూ తోటి వాహనదారులను ఇబ్బందికి గురిచేశాడు.
- Bharath Reddy
- Published On : January 19, 2022 / 12:16 PM IST
Tes
Tesla Car:ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన టెస్లా విద్యుత్ వాహనంలో ఒక వ్యక్తి “పోర్న్ చిత్రాలు”(అస్లీల చిత్రాలు) చూస్తూ తోటి వాహనదారులను ఇబ్బందికి గురిచేసిన ఘటన లండన్ మహానగరంలో చోటుచేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా టెస్లా కార్లకు ఉండే పాపులారిటీ అంతాఇంతా కాదు. విద్యుత్ తో నడిచే ఈ కార్లలో సాంకేతికంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. డ్రైవర్ లేకుండా స్వీయ నియంత్రణలోనే ఈ కార్లలో ప్రయాణించవచ్చు. కారులో అమర్చిన సెన్సార్లు కారును నియంత్రిస్తూ ఉంటాయి. మనుషుల శారీరక శ్రమను తగ్గించి, సుఖవంతమైన ప్రయాణం అందించే విధంగా ఈ కార్లను అభివృద్ధి చేసింది టెస్లా సంస్థ. అయితే కార్లలో ఉన్న సాంకేతికతను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు.
Also read: Actress Murder: గన్నీ బ్యాగ్ లో బంగ్లాదేశ్ నటి మృతదేహం
లండన్ నగరంలో ఒక టెస్లా కారు యజమాని పోర్న్ చూస్తూ తోటి వాహనదారులను ఇబ్బందికి గురిచేశాడు. లండన్ మహానగరంలో ట్రాఫిక్ లో చిక్కుకున్న ఆ ఘనుడు.. కారులోని “టచ్ ప్యానెల్” (పెద్ద తెర)లో అస్లీల చిత్రాలు చూస్తున్నట్లు పక్కనే ఉన్న మరో వాహనదారుడు గుర్తించాడు. అదేదో సరదా కోసం చేస్తున్నాడు కాబోలు అని వాహనదారుడు భావించగా.. టెస్లా యజమాని చర్యలు మరింత అసహ్యంగా తయారయ్యాయని అది గమనించిన వ్యక్తి పేర్కొన్నాడు. చుట్టూ ఉన్న పరిసరాలను ఇతర వాహనదారులను సైతం పట్టించుకోకుండా పబ్లిక్ గా కారులో పోర్న్ చిత్రాలు చూస్తున్నాడంటూ సదరు వ్యక్తి వాపోయాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ట్రాఫిక్ కెమెరాలో రికార్డు కూడా అయినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. కారులోని సాంకేతికత వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అన్ని టెస్లా కార్లలో పెద్ద టచ్ స్క్రీన్ ఉంటుంది. అదే సమయంలో అందులో ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండడంతో దాన్ని కొందరు వ్యక్తులు ఇలా దుర్వినియోగం చేస్తున్నారంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also read: Kuwait Heat: సుసంపన్న దేశం “కువైట్”లో భానుడి భగభగలు, వలస కూలీల పరిస్థితి దారుణం
