కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒకరినుంచి మరొకరికి వేగంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. వైరస్ బాధితులు తాకిన ఉపరితలాలను ఇతరులు తాకినా వారికి కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. ప్రత్యేకించి షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో వెళ్లేవారంతా ఎక్కువగా ఎలివేటర్లను వినియోగిస్తుంటారు. ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్ కు వెళ్లేందుకు ఎలివేటర్లను ఉపయోగిస్తుంటారు. కరోనా సంక్షోభ సమయంలో ఇలాంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లాలంటే భయాందోళన వ్యక్తమవుతోంది.
ఎలివేటర్లను ఉపయోగించడం ఎంతవరకు సేఫ్ అనే ఆందోళన నెలకొంది. అందుకే తమ షాపింగ్ మాల్స్ కు వచ్చే వినియోగదారుల కోసం ధాయిలాండ్ లోని ఒక మాల్ వినూత్న చర్యలను చేపట్టింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. బ్యాంకాక్‌లోని సీకాన్ స్క్వేర్ మాల్ తమ లిఫ్ట్ బటన్లను ఫుట్ పెడల్స్‌తో భర్తీ చేసింది. ఎలివేటర్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. జోరో కాంటాక్ట్ లక్ష్యంగా మాల్ ఈ కొత్త ఏర్పాట్లను చేసింది.
మాల్ ఎలివేటర్లకు బటన్లకు బదులుగా ఫుట్ పెడల్స్ అమర్చింది. వెలుపల ఫుట్ పెడల్స్‌తో తన వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. ప్రాణాంతక వైరస్ అరికట్టడంలో భాగంగా జీరో కాంటాక్టు ఉండేలా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఇప్పటివరకూ ఎలివేటర్లలో వెళ్లాల్సిన ప్లోర్ బటన్ చేతితో నొక్కాల్సిన అవసరం లేదు. ఎలివేటర్ బయటవైపు కిందిభాగంలో పెడల్స్ కనిపిస్తాయి. పెడల్స్ ఎదురుగా నెంబర్లు ఉంటాయి. మీరు వెళ్లాల్సిన ఫ్లోర్ నంబర్ కింద ఉన్న పెడల్స్ నొక్కితే చాలు.. అది అక్కడికి వెళ్లి అగిపోతుంది.
హ్యాండ్-ఫ్రీ, ఫుట్-ఆపరేటెడ్ ఎలివేటర్ ఎంతో సురక్షితం కావడంతో వినియోగదారులు నిర్భయంగా తమ షాపింగ్ పూర్తి చేసుకుంటున్నారు. మహమ్మారి లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలు మిగిలి ఉన్నందున మాల్స్, ఇతర షాపులను తిరిగి తెరిచింది. థాయిలాండ్‌లో COVID-19 కేసుల సంఖ్య తగ్గుతున్నందున, రెండవ దశ సడలింపులను ఇచ్చింది. థాయిలాండ్‌లో మొత్తం 3,037 COVID-19 కేసులు నమోదయ్యాయి. మరణించిన వారి సంఖ్య 56కు చేరింది. 2,910 మంది కోలుకున్నారు.
Read: చెట్టు కనిపిస్తే చాలు పూనకం వచ్చేస్తుంది… తల దబాదబా బాదేసుకుంటాడు