టిక్ టాక్ పిచ్చి ముదురుతోంది. ఇష్టమొచ్చినట్లు వీడియోలు తీసుకుంటూ..టిక్ టాక్‌లో పెట్టేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు, కుటుంబాలు విచ్చినమౌతున్నా..పట్టించుకోవడం లేదు. టిక్ టాక్ వీడియోలు తీసి..తమను ఎంతమంది ఫాలో అవుతున్నారు ? ఎంతమంది వీడియో చూశారు అనేదే ఆలోచిస్తున్నారు. దీనివల్ల ఇతరులకు మేలు జరుగుతుందా ? అనేది ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు.
తాజాగా ఓ యువతి చేసిన టిక్ టాక్‌పై నెటిజన్లు అసహ్యించుకుంటున్నారు. టిక్ టాక్‌లో షాకింగ్ ఛాలెంజ్‌ని ఇద్దరు అమ్మాయిలు స్టార్ట్ చేశారు. అబార్షన్ తీయించుకుంటున్న వీడియోను అప్‌లోడ్ చేశారు. అమెరికన్ టిక్ టాక్ యూసర్ (@cpcake21) పేరిట 20 సెకండ్ల వీడియో ఉంది. సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
అసలు వీడియోలో ఏముంది ? ఓ యువతి గర్భానికి సంబంధించిన టెస్టు చూపిస్తుంది. పాజిటివ్ రిజల్ట్‌ని చూపిస్తుంది. తర్వాత తన గర్బాన్ని తన అద్దంలో చూసుకుంటూ.. కనిపిస్తుంది. ఈమె ప్లానెడ్ పేరెంట్ హుడ్ క్లినిక్‌కి వెళుతారు. అక్కడ కాసేపు సోఫలో కూర్చొంటోంది. అనంతరం ఎద్ద పెద్ద ఘనకార్యం చేసినట్లుగా పంచ్‌లు విసురుకుంటూ..కనిపిస్తుంది.
ఇక్కడ సీన్ కట్ చేసిన తర్వాత..యువతి మెడికల్ గౌన్ ధరించి ఆపరేషన్ రూపంలో ఓ బల్లపై పడుకుంటుంది. ఓ లేడీ డాక్టర్ ఆమె గర్భాన్ని పరిశీలిస్తూ..అబార్షన్‌కు సిద్ధం చేస్తూ కనిపిస్తుంది. 2020, ఫిబ్రవరి 29వ తేదీన ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన ఈ ట్వీట్..పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
So generation Z girls are vlogging and celebrating their abortions now on TikTok? pic.twitter.com/scDmcKAvrx
— Mark Dice (@MarkDice) February 27, 2020