కంటతడిపెట్టిస్తోంది : కూతురి కోసం గుండు గీయించుకున్న తల్లి
- madhu
- Published On : January 28, 2021 / 05:50 PM IST
fighting cancer : సృష్టిలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ ప్రాణికైనా ‘అమ్మ’ అమ్మే. మనల్ని భూమి మీదకి తీసుకరావడానికి తన ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది అమ్మ. కూతురి కోసం ఓ అమ్మ..సాహసమే చేసింది. క్యాన్సర్ పోరాడుతున్న తన కూతురుకి సంఘీభావంగా..తల్లి గుండు గీయించుకుంది. భావోద్వేగంతో కూడుకున్న ఈ వీడియో కంటతడిపెట్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
పోర్చుగీస్ కు చెందిన లూసియానా అనే యువతి…క్యాన్సర్ బారిన పడింది. ఈ క్రమంలో..ఆమె జుట్టను కత్తిరించాల్సి ఉంది. తల్లి..కత్తిరిస్తుండగా..కూతురు చాలా భావోద్వేగానికి గురైంది. కూతురి బాధను గమనించిన తల్లి….ఆమెతో పాటు తన జుట్టును కత్తిరించుకోవడం ప్రారంభించింది. దీనికి కూతురు ఆశ్చర్యపోయింది. గుండు చేసుకోవద్దంటూ వారించింది. కానీ..ఆమె వినలేదు. మొత్తం జుట్టును తొలగించుకుని..కూతురిని ముద్దు పెట్టుకుంది. ఎంతో ఎమోషనల్ గా ఉన్న ఈ వీడియో ప్రతొక్కరి చేత కంటతడిపెట్టిస్తోంది. అమ్మ ప్రేమంటే ఇదే అనే క్యాప్షన్‌తో లూసియానా తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ సైతం షేర్ చేశారు. చాలా మంది వీడియోను వీక్షించి…కామెంట్స్ చేస్తున్నారు.
This mother surprises her daughter — who is fighting cancer. Love.
Break out the tissues…pic.twitter.com/eGkwggaIFK
— Rex Chapman?? (@RexChapman) January 26, 2021
