Germany Fire Accident: జర్మనీలో విషాదం: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయుల దుర్మరణం!

జర్మనీ(Germany Fire Accident)లోని ఒక నివాస సముదాయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.

three indians killed fire accident bakum germany suspect arrested

Germany Fire Accident: ఉపాధి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ యువతను జర్మనీలో సంభవించిన ఒక ఘోర ప్రమాదం బలితీసుకుంది. జర్మనీలోని బాకూమ్‌ నగరంలో ఉన్న ఓ నివాస సముదాయంలో అకస్మాత్తుగా జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు సూపర్ గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి మరో రూ. 72,000.. సర్కార్ కీలక నిర్ణయం!

మృతుల్లో ఇద్దరు మహిళలు.. దర్యాప్తు వేగవంతం చేసిన జర్మనీ పోలీసులు:

మృతుల వయసు 25 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉంటుందని, చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని స్థానిక అధికారులు(Germany Fire Accident) ప్రాథమికంగా ధ్రువీకరించారు. వీరంతా భారతీయులని గుర్తించినప్పటికీ, స్వదేశంలో వారు ఏ రాష్ట్రాలకు చెందినవారనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భారత ఎంబసీ అధికారులు బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.

ప్రమాదం వెనుక కుట్ర కోణం.. రొమేనియన్ పౌరుడి అరెస్ట్:

ఈ ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, దీని వెనుక తీవ్ర కుట్ర దాగి ఉందనే బలమైన అనుమానాలను స్థానిక పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. భవనానికి ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో అదే భవనంలో నివసిస్తున్న రొమేనియాకు చెందిన ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇది హత్యేనని భావించేందుకు ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.