US men wrongly jailed
America Three Men Wrongly Jailed : అమెరికాలో చేయని నేరానికి ముగ్గురు వ్యక్తులు 36 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఒక హత్య కేసులో అరెస్టై 36 ఏళ్లు శిక్ష అనుభవించిన ముగ్గురు వ్యక్తులు నిర్దోషులుగా తేలడంతో జరిగిన నష్టానికి ప్రభుత్వం వారికి 48 మిలియన్ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) పరిహారంగా చెల్లించనున్నట్లు ద వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
ఆల్ ఫ్రెడ్ చెస్ట్ నట్, రాంసమ్ వాట్ కిన్స్, ఆండ్రూ స్టీవర్ట్ 16 ఏళ్ల వయసులో ఉండగా 1983లో ఒక హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై రి అప్పీల్ చేశారు. అప్పట్లో తమ కేసు దర్యాప్తు చేసిన అధికారులు ప్రత్యక్ష, భౌతిక ఆధారాలను విస్మరించారని ఆరోపించడమే కాక, దానిని రుజువు చేయడంతో 2019లో వీరిని విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
Online Fraud : ఆన్ లైన్ మోసం.. యూట్యూబ్ వీడియోలను లైక్ చేసి రూ.73 లక్షలు పోగొట్టుకున్నారు