మంచులో స్టంట్.. చావు అంచుల్లోకి వెళ్లొచ్చిన టిక్‌టాక్ స్టార్ 

  • Publish Date - February 28, 2020 / 03:37 AM IST

అతడో టిక్ టాక్ స్టార్.. ఫాలోవర్లను మెప్పించేందుకు డేంజరస్ స్టంట్స్ చేస్తుంటాడు. జాసన్ క్లార్క్ అనే టిక్ టాక్ స్టార్ తన 4లక్షల ఫాలోవర్ల కోసం ఓ అడ్వెంచరస్ స్టంట్ చేసి చావు అంచుల్లోకి వెళ్లి వచ్చాడు. మంచుతో గడ్డుకట్టుకుపోయిన సరస్సులో ఒక రంధ్రం నుంచి నీటిలోకి వెళ్లాడు. పైనంతా మంచుతో గడ్డుకట్టుకుపోగా.. కిందిభాగంలోని నీటిలో సరదాగా ఈత కొట్టాడు.

ఇదంతా టిక్ టాక్ వీడియో చేశాడు. కానీ, మంచునీటి లోపలికి వెళ్లాక బయటకు ఎలా రావాలో అర్థం కాలేదు.. బయటకు వచ్చే మార్గం తెలియక సతమతమయ్యాడు. ఊపిరి ఆడలేదు. చివరిక్షణంలో ఎలాగో రంధ్రాన్ని గుర్తించి బయటకు వచ్చి గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు. కొంచెం అటు ఇటు అయినా అతడి ప్రాణాలు మంచునీటిలో కలిసిపోయేవి. అనంతరం ఈ వీడియోను టిక్ టాక్ లో పోస్టు చేశాడు.

ఈ సందర్భంగా జాసన్ తనకు ఎదురైన భయాంకరమైన అనుభవాన్ని ఫాలోవర్లతో పంచుకున్నాడు. ‘నేను చచ్చినంత పనైంది. బతకుతానని అనుకోలేదు. గడ్డుకట్టిన సరస్సులో నుంచి బయటకు రాలేక చాలా ఇబ్బంది పడ్డాను. అదృష్టవశాత్తూ రంధ్రం ఉన్న చోటు గుర్తించి బయటపడగలిగాను’ అంటూ తెలిపాడు. ఈ వీడియోలో జానస్.. మంచునీటిలో ఈదుతుండటం చూడొచ్చు.

మంచులో రంధ్రం పడిన చోటు నుంచి నీళ్లలో ఈదిన అతడు తిరిగి అక్కడికి వచ్చేందుకు ప్రయత్నించిన తీరు చూస్తే వణుకుపుట్టించేలా ఉంది. మంచును బ్రేక్ చేసేందుకు అతడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎట్టకేలకు వచ్చిన రంధ్రాని గుర్తించి బయట పడటాన్ని వీడియోలో కనిపించింది. టిక్ టాక్ స్టార్ జాసన్ ఈ వీడియోను పోస్టు చేసిన కొద్దిక్షణాల్లోనే 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Also Read | టిక్‌టాక్, ట్విటర్, వాట్సప్ పై క్రిమినల్ కేసులు

ట్రెండింగ్ వార్తలు