చైనా నుంచి భారత్ కు : మరికొద్దిసేపట్లో ఢిల్లీకి 6.5లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్

  • Publish Date - April 16, 2020 / 05:28 AM IST

చైనా నుంచి భారత్ కు ఇవాళ(ఏప్రిల్-16,2020)6.5లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ కిట్స్,RNA టెస్టింగ్ కిట్ లు రానున్నాయి. చైనాలోని గ్యాంగ్డో విమానాశ్రయం నుంచి టెస్టింగ్ కిట్స్ విమానాం ఢిల్లీకి బయలుదేరింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ లు భారత్ కు రావడంలో బీజింగ్ లోని భారత ఎంబసీ మరియు గువాంగ్జూలోని కాన్సులేట్ ముఖ్య పాత్రపోషించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ కిట్స్(గువాంగ్జూ వాండ్ ఫో నుంచి 3లక్షల మొదటి లాట్ మరియు జుహాయ్ లివ్జోన్ నుంచి 2.5లక్షలు)మరియు RNA ఎక్స్ ట్రాక్షన్ కిట్ లు(MGI షెంగ్జన్ నుంచి 1లక్ష) గత రాత్రి భారత్ కు వచ్చేందుకు అవసరమైన అన్ని అనుమతులు పొందాయని,ఇవాళ ఉదయం చైనాలోని గ్యాంగ్డో ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి అవి బయలుదేరినట్లు భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

మరోవైపు ఇప్పటివరకు 2.74 లక్షల కరోనా టెస్ట్ లు నిర్వహించింది ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్). ఇప్పటివరకు భారత్ లో 12వేల 380 కరోనా కేసులు నమోదుకాగా,414మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24గంటల్లోనే 37మరణాలు నమోదయ్యాయి. ఇక బుధవారం 170కరోనా హాట్ స్పాట్ జిల్లాల లిస్ట్ ను కేంద్రం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Also Read |  పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా.. ఆర్డర్ ఇచ్చిన 72 ఫ్యామిలీలు క్వారంటైన్‌లోకి