Donald Trump : అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ట్రంప్ సంచలన కామెంట్స్.. ఒక్క రోజులోనే 3 ట్రిలియన్ డాలర్లు నష్టం ..
Donald Trump : అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
- Harish Thanniru
- Published on- November 8, 2026 / 10:16 PM IST
Donald Trump
Donald Trump : అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లకు ప్రతికూల ఫలితాలు రావడంపై ఆయన స్పందించిన ఆయన.. భయపడాల్సిన పనిలేదు.. తాము తిరిగి పుంజుకుంటాం.. గతంలో కన్నా మరింత గొప్పగా, బలంగా తయారవుతామంటూ ట్రూత్ సోషల్ వేదికగా ధీమా వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : Rajat Patidar : బీసీసీఐ బిగ్ డెషిషన్.. ఆసియా కప్ నుంచి రజత్ పాటిదార్ ఔట్.. అసలేం జరిగిందంటే..?
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల ప్రభావంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయని ఆరోపించారు. మార్కెట్ పతనానికి రిపబ్లికన్లు కారణం కాదని, డెమోక్రాట్ల విజయమే ఇందుకు కారణమని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుల్లో ఒకటిని చూసిందని ట్రంప్ పేర్కొన్నారు. తన హయాంలో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్ కూడా.. ఈ ఎన్నికల ఫలితాల కారణంగా ఒక్క రోజులోనే 3 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని చెప్పారు.
మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ ఆధిపత్యం సాధించారు. దీంతో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై ఇకపై ప్రతిపక్షానికి మరింత పర్యవేక్షణ అధికారం లభించనుంది. ప్రభుత్వ విధానాలపై విచారణలు, ప్రశ్నలు, చర్చలు పెరిగే అవకాశం ఉంది. ట్రంప్ ప్రతిపాదించే చట్టాలు ఆమోదం పొందడం కూడా సవాలుగా మారవచ్చు. మరోవైపు డెమోక్రాట్ల విజయం తర్వాత మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ఏఐ రంగంపై నియంత్రణల భయాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
