×
Ad

Trump Is Dead: ట్రెండింగ్ లో ‘Trump is Dead’.. అదే నిజమైతే డబ్బులిస్తామంటున్న నెటిజన్లు..

ఇటీవలి కాలంలో ట్రంప్ కనిపించట్లేదని, ఆయన చనిపోయి ఉంటారని పలువురు నెటిజన్లు చేస్తున్న పోస్టులు సంచలనంగా మారాయి.

Trump Is Dead: TRUMP IS DEAD.. ఇప్పుడీ హ్యాష్‌ ట్యాగ్ ఎక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. ట్రంప్ వైట్‌హౌస్‌లో కనిపించకపోవడంతో కొందరు ఎక్స్ వేదికగా ఈ పోస్టులు పెడుతున్నారు. ట్రంప్ CVI వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీనికి తోడు దేశంలో ‘టెర్రిబుల్ ట్రాజెడీ’ సంభవిస్తే తాను అధ్యక్ష బాధ్యతలకు సిద్ధంగా ఉన్నట్లు వైస్ ప్రెసిడెంట్ వాన్స్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ట్రంప్ ఈజ్ డెడ్ అనే హ్యాష్‌ ట్యాగ్ ఎక్స్ లో ట్రెండ్ అవుతుండటంతో వైట్ హౌస్ స్పందించింది. ఆ రూమర్లను తీవ్రంగా ఖండించింది. ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. వర్జీనియాలోని గోల్ఫ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడారని ప్రకటించింది. వైట్ పోలో టీషర్ట్, రెడ్ కలర్ MAGA క్యాప్, బ్లాక్ ప్యాంట్ ధరించారంది.

ఏది ఏమైనా.. ఇటీవలి కాలంలో ట్రంప్ కనిపించట్లేదని, ఆయన చనిపోయి ఉంటారని పలువురు నెటిజన్లు చేస్తున్న పోస్టులు సంచలనంగా మారాయి. కొందరు నెటిజన్లు చేస్తున్న పోస్టులు అంతకు మంచి హాట్ టాపిక్ గా మారాయి. ట్రంప్ ఈజ్ డెడ్.. అనేది నిజమైతే డబ్బులు ఇస్తామంటున్నారు.
ఒకవేళ ట్రంప్ చనిపోయి ఉంటే.. ఈ ట్వీట్ ని లైక్ చేసిన వారికి 50 డాలర్లు ఇస్తాను అని ఒకరు, 100 డాలర్లు ఇస్తానని మరొకరు, 500 డాలర్లు ఇస్తానని ఇంకొకరు ఎక్స్ లో పోస్టులు పెట్టారు.

Also Read: ట్రంప్ మిస్సింగ్..! అనారోగ్యం గురించి పుకార్లు.. ఈలోపు అమెరికా అధ్యక్షుడు ఏమైనట్టు?