×
Ad

Trump Offers Eaten Pizza : నేను కొరికిన పిజ్జా పీస్ ఎవరికైనా కావాలా? ఆఫర్ చేసిన ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓబంపర్ ఆఫర్ ఇచ్చారు. నేనుకొరికి తిన్న పిజ్జా మీకు కావాలా?అంటూ ఆఫర్ ఇచ్చారు.

  • Published On : April 24, 2023 / 01:21 PM IST

Trump Offers Eaten Pizza

Trump offers eaten pizza : డొలాల్డ్ ట్రంప్.  అమెరికా మాజీ అధ్యక్షుడు ఏం చేసినా ఏం మాట్లాడినా సంచలనమే. ఆయనిదో ఓ ప్రత్యేకమైన స్టైల్. అటువంటి ట్రంప్ ఓ భారీ పిజ్జాను తింటూ నేను తినే పిజ్జా పీస్ మీలో ఎవరికైనా కావాలా?అంటూ ఆఫర్ చేశారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ మయర్స్‌లో రిపబ్లిక్ పార్టీ ప్రసంగం తరువాత ఆయన మద్దతుదారులు ఆయన్ని చుట్టుముట్టారు.దీంతో ట్రంప్ ఓ చేతిలో భారీ పెప్పరోనీ పిజ్జాను పట్టుకుని మరో చేతితో ఆయన ఓ పిజ్జా ముక్కను పట్టుకుని ‘నేను కొరికిన పిజ్జా పీస్ మీలో ఎరికైనా కావాలా?’ అంటూ తన అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేస్తూ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మరి ట్రంప్ ఆఫర్ ఇస్తే వద్దంటారా? పైగా వారంతా ఆయన అభిమానులు, మద్దతుదారులును..పిజ్జా పీస్ ఆఫర్ చేయగానే ఆయన అభిమానులు “ట్రంప్! ట్రంప్! ట్రంప్!”అంటూ నినాదాలతో హోరెత్తించారు. దాంతో ట్రంప్ మరింత హుషారుగా ఉత్సాహపరిచారు

కాగా..ట్రంప్ ను ఇటీవలే అరెస్ట్ చేయడం, విడుదల చేయడం వంటి విషయాలు తెలిసిందే. అంతేకాదు సంచలనాల ట్రంప్ ఇటీవల ఓ పోర్న్ స్టార్ తో చేసుకున్న ఒప్పందాలపై కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటువంటిసంచలనాలే తనకు ఫ్రీ పబ్లిసిటీగా మారతాయని భావిస్తున్నారు. పోర్న్ స్టార్ అంశంపై కేసు నమోదు తనకు మరింత ప్రచారాన్ని తీసుకొస్తుందని స్వయంగా ట్రంప్ ప్రకటించడం గమనించాల్సిన విషయం.

అలా తనదైన శైలిలో ట్రంప్ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ వివాదాలు 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో తనకు అనుకూలంగా ఉంటుందంటున్నారు. మరోసారి అధ్యక్షుడి రేసులో ఉన్న ట్రంప్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ప్రారంభించేసారు. కాగా..ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు సంచలనాత్మక నిర్ణయంలతో ప్రపంచ అంతా తనవైపుకు చూసేలా చేశారు.