Donald Trump : వార్నీ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఫాలో అవుతున్న ట్రంప్..?

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఫాలో అవుతున్నారా అంటూ.. సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

Donald Trump

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు. ప్రతీ అమెరికన్‌కు 5వేల డాలర్లు (సుమారు రూ. 4.2లక్షలు) చొప్పున ‘ట్రంప్ డివిడెండ్’ పేరుతో చెల్లిస్తామని అన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం డల్లాస్‌లో రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన సదస్సులో ట్రంప్ ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.

Also0 Read : Gold Silver Prices Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. కొనుగోలు చేసేవారికి బిగ్ అలర్ట్..

నవంబర్ 3వ తేదీన మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల సభ, సెనేట్ పై పట్టు నిలబెట్టుకుంటే .. ప్రతి వయోజన అమెరికన్ కు 5వేల డాలర్లు ఇస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని ‘ట్రంప్ డివిడెండ్’ గా పిలుస్తామని చెప్పారు. మన దేశం చాలా డబ్బు సంపాదిస్తోందని చెప్పిన ట్రంప్.. ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా.. తనను బ్యాలెట్ పై ఉన్నట్టుగా భావించి పార్టీకి ఓటేయాలని మద్దతుదారులను కోరారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు రెండు సభల్లోనూ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేసిన ట్రంప్.. మరోసారి చెబుతున్నా.. నేనే బ్యాలెట్ లో ఉన్నట్లుగా భావించండి అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ట్రంప్ ప్రకటించిన ‘ట్రంప్ డివిడెండ్’ పథకానికి కనీసం ఒక ట్రిలియన్ డాలర్లు అవసరమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇంత భారీ మొత్తం సొమ్మును ఎక్కడి నుంచి తెస్తారనే విషయంపై అమెరికా ప్రెసిడెంట్ స్పష్టత ఇవ్వలేదు.

తాజా సర్వే ప్రకారం.. ప్రస్తుత పరిస్థితులు రిపబ్లికన్లకు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు 230-205 ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉండగా.. సెనేట్ లోనూ 51-49తో మెజార్టీ సాధించే అవకాశం ఉందని అధిక శాతం సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే, ఈ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌ పేరును, వ్యక్తిగత ప్రభావాన్ని ఉపయోగించి రిపబ్లికన్‌ ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు ఎంతవరకు తీసుకురాగలరన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

ఇదిలాఉంటే.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ట్రంప్.. ఏపీ, తెలంగాణ రాజకీయాలను ఫాలో అవుతున్నట్లుంది అంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తుండటం విశేషం.