Tulsi Gabbard : భర్తకోసం పదవి త్యాగం.. యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ రాజీనామా..! ట్రంప్ కీలక కామెంట్స్..

Tulsi Gabbard : అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌ (DNI)గా పనిచేస్తున్న తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ఆమె రాజీనామా ప్రకటనపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. గబ్బార్డ్ రాజీనామా దురదృష్టకరమని, డీఎన్ఐగా తన పదవీకాలంలో ఆమె గొప్ప పని చేశారని ట్రంప్ కొనియాడారు.

Tulsi Gabbard resigns as director of national intelligence

  • యూఎస్ జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌ తులసి గబ్బార్డ్‌ కీలక నిర్ణయం
  • తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
  • జూన్ 30 నుంచి బాధ్యతల నుంచి వైదొలుగుతానని వెల్లడి

Tulsi Gabbard : అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌ (DNI)గా పనిచేస్తున్న తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. తాను ఈ అత్యున్నత పదవికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం వ్యక్తిగత కారణాలేనని పేర్కొన్నారు. తన భర్త అబ్రహాం అనారోగ్య సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. జూన్ 30 నుంచి తాను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. అయితే, ఆమె రాజీనామా వార్త అమెరికా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

Also Read : petrol and diesel prices hiked : దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈసారి ఎంతంటే? నెలలో మూడోసారి..

గబ్బార్డ్ రాజీనామా లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నా భర్తకు ఇటీవల అరుదైన బోన్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. రాబోయే రోజుల్లో పెద్ద సవాళ్లను ఎదుర్కోనున్నారు. ఈ సమయంలో ఆయనకు తోడుగా ఉండి పూర్తి మద్దతు ఇవ్వడానికి నేనే ప్రజాసేవ నుంచి వైదొలుగుతున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే, ఆమె రాజీనామాపై రాజకీయ వర్గాల్లో మరిన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, విదేశాంగ విధానాలపై ఆమె అభిప్రాయాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరికి భిన్నంగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇరాన్ పై అమెరికా దాడుల విషయంలో ఆమె మితమైన వాఖ్యలు చేయడం వైట్ హౌస్ అసంతృప్తికి కారణమైందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. గత మార్చిలో తన పార్లమెంటు ప్రసంగంలో ఆమె ట్రంప్ యుద్ధ నిర్ణయాన్ని సమర్ధించలేదు కూడా. గతంలో డెమోక్రటిక్ పార్టీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన గబ్బార్డ్ ఆది నుంచీ విదేశాలతో అమెరికా యుద్ధాలను వ్యతిరేకించే నాయకురాలిగా ప్రస్తిద్ధి పొందారు.

జూన్ 30 నుంచి తాను పదవి నుంచి వైదొలుగుతానని గబ్బార్డ్ పేర్కొన్నారు. అయితే, ఆ తరువాత ఆమె స్థానంలో ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న ఆరోన్ లూకాస్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గబ్బార్డ్ రాజీనామా పై ట్రంప్ స్పందించారు. గబ్బార్డ్ రాజీనామా దురదృష్టకరమని, డీఎన్ఐగా తన పదవీకాలంలో ఆమె గొప్ప పని చేశారని ట్రంప్ కొనియాడారు.


అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI)గా తులసి గబ్బార్డ్ 2025 ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో హవాయ్ నుంచి కాంగ్రెస్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఒకప్పుడు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఆమె, తరువాత స్వతంత్ర రాజకీయ వైఖరితో గుర్తింపు పొందారు. గాబార్డ్ యూఎస్ కాంగ్రెస్ లో మొట్టమొదటి హిందూ సభ్యురాలు.