Plane Crash:ఢీకొన్న వాయుసేన విమానాలు..ముగ్గురు మృతి
దక్షిణ కొరియా వైమానికి దళానికి చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. శుక్రవారం (ఏప్రిల్ 1,2022) జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరొరకు తీవ్రంగా గాయపడ్డారు.
- nagamani
- Published On : April 1, 2022 / 02:31 PM IST
South Korea Plane Crash
South Korea Plane Crash: దక్షిణ కొరియా వైమానికి దళానికి చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. శుక్రవారం (ఏప్రిల్ 1,2022) జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరొరకు తీవ్రంగా గాయపడ్డారు. సచియాన్ నగరానికి సమీపంలోని లోయ ప్రాంతంలో రెండు వాయుసేన విమానాలు కూలిపోయాయి అని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలు సహా పలువురు సిబ్బందిని తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
కేటీ-1 మోడల్‌కు చెందిన ఈ విమానాలను శిక్షణ కోసం ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రైనింగ్ సమయంలో గాల్లోనే ఈ ప్రమాదం జరిగింది.ఈ విమానాల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరని తెలిపారు..ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో మరిన్ని వివరాల కోసం దర్యాప్తును కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. కాగా గత జనవరిలో కూడా దక్షిణ కొరియా వాయుసేనకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఎఫ్-5ఈ రకానికి చెందిన ఈ విమానం కొండను ఢీకొనడం వల్ల పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.
