Nuclear Test or UFO : UFOలా, అణు పరీక్షలా? అమెరికాలో ఏం జరుగుతోంది? 10 మంది మిస్ అయిన సైంటిస్టులకి లింక్ ఉందా?

Nuclear Test or UFO : అమెరికాలో ఏప్రిల్ 30వ తేదీన, మే 1వ తేదీన నేవడాలోని ఏరియా 51 ప్రాంతంలో సుమారు 17 భూకంపాలు నమోదయ్యాయి. అందులో అత్యంత తక్కువది 2.2 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత కాగా, అత్యంత పెద్దది. కానీ, ఎందుకు ఈ 17 భూప్రకంపనల మీద ఇంత ఆందోళన కలుగుతోంది అంటే దానికి సమాధానం ఇది ఏరియా 51లో జరగడమే.

UFOs or nuclear testing What triggered earthquakes in Area 51 in the US

  • అమెరికాలో ఏం జరుగుతోంది..
  • నేవడాలోని ఏరియా 51 ప్రాంతంలో సుమారు 17 భూకంపాలు
  • ఏరియా 51 అంటే ఏంటి?
  • అమెరికా అణుబాంబులు పరీక్షిస్తుందా?
  • UFOలకు లింక్ ఏంటి?
  • మిస్ అయిన సైంటిస్టులకి, దీనికి లింక్ ఏంటి?

Nuclear Test or UFO : అమెరికాలో చిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక వైపు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ వార్ గురించే ప్రపంచం చర్చించుకుంటుండగా, ప్రపంచానికి దూరంగా అమెరికాలోని నేవడా రాష్ట్రంలో కొన్ని చిత్రమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వాటిని నిశితంగా గమనిస్తే అవి ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయా? లేకపోతే వేటికవే యాదృచ్ఛికంగా జరిగాయా అనే సందేహాలు రాకమానదు.

అసలు ఏం జరిగింది?
అమెరికాలో ఏప్రిల్ 30వ తేదీన, మే 1వ తేదీన నేవడాలోని ఏరియా 51 ప్రాంతంలో సుమారు 17 భూకంపాలు నమోదయ్యాయి. అందులో అత్యంత తక్కువది 2.2 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత కాగా, అత్యంత పెద్దది 4.4 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో నమోదైంది. దీని వల్ల ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తినష్టం జరగలేదు. కానీ ఎందుకు ఈ 17 భూప్రకంపనల మీద ఇంత ఆందోళన కలుగుతోంది అంటే దానికి సమాధానం ఇది ఏరియా 51లో జరగడమే.

ఏరియా 51 అంటే ఏంటి?
ఏరియా 51 అనేది నేవడా రాష్ట్రంలో ఉన్న అమెరికా ఎయిర్ ఫోర్స్ స్టేషన్. దీని వెనుక చాలా కథ ఉంది. ఇది ఉన్నట్టు కూడా అమెరికా అధికారికంగా ప్రకటించడానికి ఒకదశలో ముందుకు రాలేదు. అమెరికా రక్షణ రంగానికి సంబంధించిన చాలా పరీక్షలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. 1951 నుంచి 1992 మధ్య ఇక్కడ సుమారు 900 అణు పరీక్షలు నిర్వహించారు. అంటే, న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించడానికి అత్యంత సేఫ్ ప్రదేశం అన్నమాట. దీన్ని బట్టే.. ఈసారి కూడా అలాంటిదే ఏదైనా జరిగిందా అనే సందేహాలు వస్తున్నాయి.

అమెరికా అణుబాంబులు పరీక్షిస్తుందా?
ఏరియా 51లో రికార్డయిన భూ ప్రకంపనలను పరిశీలిస్తే అవి భూమికి సుమారు 4 కిలోమీటర్ల లోతులో నమోదైనట్టు గుర్తించారు. అంటే భూకంపకేంద్రం భూమికి లోపల 4 కి.మీల కింద ఉంది. అమెరికా ప్రపంచానికి తెలియకుండా అణుపరీక్షలు నిర్వహిస్తుందేమో అనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఇరాన్ తో యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. ఒక దశలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మొత్తం ఇరాన్ నాగరికతనే లేకుండా సర్వనాశనం చేసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అంటే, ఆ దిశగా అమెరికా ఏదైనా న్యూక్లియర్ టెస్టులు చేస్తుందా?.

UFOలకు లింక్ ఏంటి?
ఏరియా 51 అనేది పేరుకి అమెరికా రక్షణ రంగానికి సంబంధించిన ప్రదేశమే. కానీ, దీనికి మరో కథ కూడా ఉంది. అమెరికాలో కనిపించిన చాలా UFOలు ఈ ఏరియా 51లోనే. అలాగే, అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో ఏలియన్ల శరీరాలు కనిపిస్తే వాటిని తీసుకొచ్చి ఇక్కడే పరిశోధనలు చేశారనే వాదన ఉంది. అంటే ఇది న్యూక్లియర్ టెస్టింగ్ సెంటరే కాదు. ఒక రకంగా ఏలియన్ రిసెర్చ్ సెంటర్ కూడా అన్నమాట.

మిస్ అయిన సైంటిస్టులకి, దీనికి లింక్ ఏంటి?
ఈ మధ్య అమెరికాలో జరిగిన విచిత్ర ఘటనల్లో సైంటిస్టులు మిస్ అవ్వడం కూడా ఒకటి. వివిధ రంగాలకు చెందిన సైంటిస్టులు (కొందరికి ఒకరితో మరొకరికి సంబంధం ఉంది. కొందరికి పరస్పరం తెలియదు) మిస్ అయ్యారు. అలాగే, కొందరిని చంపేశారు. అంటే, ఆ మిస్ అయిన వాళ్లతో ఇక్కడ ఏమైనా టెస్టులు చేయిస్తున్నారా అని కొందరు సోషల్ మీడియాలో లాజిక్స్ వెతుకుతున్నారు. ఈ థియరీల మీద ఎఫ్‌బీఐ కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది.