×
Ad

UK Bans Laughing Gas : ఇక లాఫింగ్ గ్యాస్‌పై నిషేధం…యూకే సంచలన నిర్ణయం

లాఫింగ్ గ్యాస్ వినియోగం విషయంలో యూకే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల లాఫింగ్ గ్యాస్ అయిన నైట్రస్ ఆక్సైడ్ చిన్న డబ్బాల విక్రయం ఇటీవల పెరిగిన నేపథ్యంలో యూకే దాన్ని నిషేధించింది.....

  • Published On : November 8, 2023 / 11:35 AM IST

UK Bans Laughing Gas

UK Bans Laughing Gas : లాఫింగ్ గ్యాస్ వినియోగం విషయంలో యూకే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల లాఫింగ్ గ్యాస్ అయిన నైట్రస్ ఆక్సైడ్ చిన్న డబ్బాల విక్రయం ఇటీవల పెరిగిన నేపథ్యంలో యూకే దాన్ని నిషేధించింది. యువకులు త్వరితగతిన ఎక్కువ మోతాదులో ఈ లాఫింగ్ గ్యాస్ ను వినోదాత్మకంగా పీల్చుతున్నారు. లాఫింగ్ గ్యాస్‌ను వినోదాత్మకంగా ఉపయోగించడాన్ని నిషేధించింది. బ్రిటన్‌లో బుధవారం నాడు బ్రిటన్‌లో లాఫింగ్ గ్యాస్ కలిగి ఉండటం చట్టవిరుద్ధంగా మారింది.

Also Read :  Most Expensive Hotel : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్‌లో రాత్రి బస చేయాలంటే…

ఉల్లంఘించి వరుస నేరాలకు పాల్పడేవారికి రెండేళ్ల వరకు, డీలర్‌లకు 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు. దీర్ఘకాలం ఈ గ్యాస్ ఉపయోగించడం వల్ల రక్తహీనత, నరాలు దెబ్బతినడం, వెన్నెముకకు గాయాలు సంభవిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.‘‘ నైట్రస్ ఆక్సైడ్ దుర్వినియోగం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరం మాత్రమే కాదు, ఇది చట్టవిరుద్ధం అని ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఈ రోజు మేం స్పష్టమైన సంకేతాన్ని పంపుతున్నాం’’అని యూకే పోలీసింగ్ మంత్రి క్రిస్ ఫిల్ప్ చెప్పారు.

Also Read : Swarna Mudra sweet : దీపావళికి స్వర్ణ ముద్ర స్వీట్లు…కిలో ధర తెలిస్తే షాకవుతారు

చాలా కాలంగా బహిరంగ ప్రదేశాల్లో ఈ డ్రగ్‌ని ఉపయోగించడం వల్ల సంఘ వ్యతిరేక ప్రవర్తనకు దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు అపరిమిత జరిమానా విధిస్తారు. ఈ నేరం పునరావృతం చేసే నేరస్థులకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.