Most Expensive Hotel : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్‌లో రాత్రి బస చేయాలంటే…

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ సూట్‌లో ఒక రాత్రి బస చేసేందుకు టారిఫ్‌ను చూసి మీరు షాక్ అవుతారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బాలీవుడ్ న‌టి అన‌న్యా పాండే క‌జిన్ అల‌న్నా పాండే ఇటీవల తన అనుచరులకు దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన సూట్‌ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు.....

Most Expensive Hotel : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్‌లో రాత్రి బస చేయాలంటే…

Most Expensive Hotel

most expensive Hotel : మీరు విలాసవంతమైన హోటల్‌లో ఒక రాత్రి బస చేసేందుకు ఎంత ఖర్చు చేస్తారు? అంటే ట్రిప్ బడ్జెట్‌ను బట్టి సాధారణంగా రూ.10వేల నుంచి 20వేలరూపాయల వరకు వెచ్చిస్తుంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ సూట్‌లో ఒక రాత్రి బస చేసేందుకు టారిఫ్‌ను చూసి మీరు షాక్ అవుతారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బాలీవుడ్ న‌టి అన‌న్యా పాండే క‌జిన్ అల‌న్నా పాండే ఇటీవల తన అనుచరులకు దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన సూట్‌ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు.

Also Read : Divorce : విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు…ప్రముఖ సింగర్ దంపతుల డివర్శ్

సంపన్నులు బస చేసే ఈ సూట్ దుబాయ్‌లోని అట్లాంటిస్ ది రాయల్‌ హోటల్ లో ఉంది. ఈ హోటల్ సూట్ లో ఒక రాత్రి బస చేయాలంటే రూ. 83 లక్షల రూపాయలు అద్దె కింద చెల్లించాలి. అలన్నా తన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో విస్మయపరిచే హోటల్ గదిని పంచుకుంది. ది రాయల్ మాన్షన్ అని పిలిచే ఈ అల్ట్రా-ఆధునిక నాలుగు పడక గదుల పెంట్‌హౌస్ లో అద్భుతమైన సౌకర్యాలున్నాయి. సూట్ తెలుపు, బంగారు రంగులతో అద్భుతంగా ఉంది.

Also Read :  Newest Covid variant : మళ్లీ కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ వ్యాప్తి…శాస్త్రవేత్తల ఆందోళన

ఈ విలాసవంతమైన సూట్‌లో ప్రైవేట్ ఫోయర్, 12-సీట్ల భోజనాల గది, కాన్ఫరెన్స్ రూమ్, ఎంటర్‌టైన్‌మెంట్ రూమ్, ఇండోర్, అవుట్‌డోర్ కిచెన్, సినిమా థియేటర్, ఆఫీసు, లైబ్రరీ, ప్రైవేట్ బార్ ఉన్నాయి. ఈ సూట్ విలాసవంతమైన జీవనానికి నిదర్శనంగా నిలుస్తోది. అట్లాంటిస్ ది రాయల్ ప్రపంచ-స్థాయి సూట్‌ ప్రస్తుత సంవత్సరం జనవరిలో అతిథుల కోసం దాని తలుపులు తెరిచింది. గ్లోబల్ సూపర్ స్టార్ బెయోన్స్ ప్రత్యేక ప్రదర్శనతో గ్రాండ్ లాంచ్ చేశారు. ఈ హోటల్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన నటీనటులు హాజరయ్యారు.