Newest Covid variant : మళ్లీ కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ వ్యాప్తి…శాస్త్రవేత్తల ఆందోళన

మళ్లీ కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆందోళను గురిచేస్తోంది. లక్సెంబర్గ్ లో వెలుగుచూసిన కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ ఇంగ్లాండ్, ఐస్‌లాండ్, ఫ్రాన్స్, యూఎస్ దేశాల్లోనూ వ్యాప్తి చెందింది.....

Newest Covid variant : మళ్లీ కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ వ్యాప్తి…శాస్త్రవేత్తల ఆందోళన

newest Covid variant JN.1

Newest Covid variant : మళ్లీ కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆందోళను గురిచేస్తోంది. లక్సెంబర్గ్ లో వెలుగుచూసిన కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ ఇంగ్లాండ్, ఐస్‌లాండ్, ఫ్రాన్స్, యూఎస్ దేశాల్లోనూ వ్యాప్తి చెందింది. కొవిడ్ మహమ్మారి ఇతర వేరియెంట్లతో పోలిస్తే ఈ కొత్త కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ లో చాలా తేడా ఉండటంతో శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు.

Also Read : Earthquake : పంజాబ్,కాశ్మీరుల్లో మళ్లీ భూకంపం, వరుస భూప్రకంపనలతో వణుకుతున్న జనం

తీవ్ర అంటు వ్యాధి అయిన ఈ కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్సెంబర్గ్‌లో గుర్తించిన కొత్త కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ అప్పటి నుంచి పలు దేశాలకు వ్యాపించింది. కొవిడ్ మాతృ జాతితో వ్యత్యాసమున్న ఈ వేరియంట్ నివారణకు ప్రస్థుతమున్న వ్యాక్సిన్లు పనిచేయవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Also Read : Fire Breaks Out : మహారాష్ట్ర గోదాంలో ఘోర అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి

ఈ కొత్త వేరియంట్ వల్ల అధిక ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందని న్యూయార్క్ లోని బఫెలో విశ్వవిద్యాలయం డాక్టర్ థామస్ రస్సో చెప్పారు. మునుపటి కొవిడ్ వేరియెంట్ల కంటే ఈ జెఎన్ 1 వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందే సూచనలు ఉన్నాయని థామస్ పేర్కొన్నారు. ఈ జెఎన్ 1 వేరియంట్ నివారణకు నవీకరించిన కొవిడ్ వ్యాక్సిన్లు సహాయపడవచ్చని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.