Earthquake : పంజాబ్,కాశ్మీరుల్లో మళ్లీ భూకంపం, వరుస భూప్రకంపనలతో వణుకుతున్న జనం

దేశంలోని పంజాబ్, కశ్మీరు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 1.13 గంటలకు భూకంపం సంభవించింది.....

Earthquake : పంజాబ్,కాశ్మీరుల్లో మళ్లీ భూకంపం, వరుస భూప్రకంపనలతో వణుకుతున్న జనం

Earthquake

Updated On : November 8, 2023 / 6:32 AM IST

Earthquake : దేశంలోని పంజాబ్, కశ్మీరు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 1.13 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. జమ్మూకశ్మీరులోని కిష్టావర్ ప్రాంతంలో మంగళవారం భూకంపం వచ్చింది. మంగళవారం రాత్రి 6.52 గంటలకు భూమి కంపించింది.

Also Read : Fire Breaks Out : మహారాష్ట్ర గోదాంలో ఘోర అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలోనూ 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. నేపాల్, ఢిల్లీతోపాటు వరుస భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

Also Read : Golf Course : ఛీ..ఛీ.. మీ కక్కుర్తి పాడుగాను.. ఎక్కడా ప్లేస్ లేనట్లు బంకర్‌లో ఇదేం పాడుపని, వీడియో వైరల్

ఈ వరుస భూకంపాలు భవిష్యత్ లో హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపానికి సంకేతాలని భూకంప శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో ప్రజలు ఎప్పుడు భూమి కంపిస్తుందో ఏమవుతుందోనని తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. మొత్తం మీద నేపాల్ దేశంతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గత నాలుగురోజులుగా వరుస భూప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి.