Divorce : విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు.. ప్రముఖ సింగర్ దంపతుల డివోర్స్

ఇటీవల పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. వివాహం అయిన తర్వాత దంపతుల మధ్య తలెత్తిన వివాదాల వల్ల పలు సెలబ్రిటీ జంటలు విడిపోవడం సంచలనం రేపుతోంది. ఇటీవల శిల్పా శెట్టి, క్రికెటర్ థవన్ దంపతులు డైవర్శ్ తీసుకున్నారు. ఇలా విడిపోయిన సెలబ్రిటీల జాబితాలోకి తాజాగా గాయకుడు హనీ సింగ్ చేరారు....

Divorce : విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు.. ప్రముఖ సింగర్ దంపతుల డివోర్స్

Singer Honey Singh, Wife Shalini Talwar

Divorce : ఇటీవల పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. వివాహం అయిన తర్వాత దంపతుల మధ్య తలెత్తిన వివాదాల వల్ల పలు సెలబ్రిటీ జంటలు విడిపోవడం సంచలనం రేపుతోంది. ఇటీవల శిల్పా శెట్టి, క్రికెటర్ థవన్ దంపతులు డివర్శ్ తీసుకున్నారు. ఇలా విడిపోయిన సెలబ్రిటీల జాబితాలోకి తాజాగా గాయకుడు హనీ సింగ్ చేరారు. ప్రముఖ గాయకుడు హనీసింగ్, షాలినీ తల్వార్‌ దంపతులకు ఢిల్లీ కోర్టు ఎట్టకేలకు విడాకులు మంజూరు చేసింది. హనీ సింగ్, షాలిని తల్వార్ ను 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. హనీసింగ్ పై అతని భార్య షాలినీ గృహహింస కేసు పెట్టింది.

Also Read : Newest Covid variant : మళ్లీ కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ వ్యాప్తి…శాస్త్రవేత్తల ఆందోళన

ఏడాదికి పైగా వ్యాజ్యం తర్వాత గాయకుడు హనీ సింగ్, ఆయన భార్య షాలినీ తల్వార్‌లకు ఢిల్లీ కోర్టు మంగళవారం విడాకులు మంజూరు చేసింది.గాయకుడు హనీ సింగ్, ఆయన భార్య షాలినీ తల్వార్‌ లు 2011 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. సింగర్ దంపతులు 2022వ సంవత్సరం సెప్టెంబరులో పరస్పర విడాకులు కోరుతూ ఒక అభ్యర్థనను సమర్పించారు.సాకేత్ కోర్టులోని ఫ్యామిలీ కోర్ట్ ప్రిన్సిపల్ జడ్జి పరంజీత్ సింగ్ వారి మధ్య ఉన్న అన్ని వివాదాలను ముగించడానికి ఒక పరిష్కార ఒప్పందానికి వచ్చిన తర్వాత విడాకుల డిక్రీని మంజూరు చేశారు.

Also Read : Swarna Mudra sweet : దీపావళికి స్వర్ణ ముద్ర స్వీట్లు…కిలో ధర తెలిస్తే షాకవుతారు

ఈ దంపతులు గత సంవత్సరం కోటిరూపాయలు భరణం ఇచ్చేలా సెటిల్మెంట్ చేసుకున్నారు. దీంతో షాలినీ హనీ సింగ్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకుంది.విచారణ సందర్భంగా న్యాయమూర్తి లేవనెత్తిన ప్రశ్నలో హనీ సింగ్ తన భార్యతో కలిసి జీవించే అవకాశం లేదని చెప్పారు. హనీ సింగ్ తరఫు న్యాయవాది ఇషాన్ ముఖర్జీ వాదించారు. రెండో మోషన్‌ను అనుమతించిన తర్వాత విడాకుల డిక్రీని కోర్టు మంజూరు చేసిందని ఇషాన్ చెప్పారు.

విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు వీరే…

తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. సినీనటుడు మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చి భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. ర్శకుడు కె.రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి ప్రేమించి పెళ్లాడిన సినీరచయిత్రి కనిక దిల్లాన్ విడిపోయారు. సుమంత్, కీర్తిరెడ్డిలు కూడా పెళ్లి చేసుకున్న రెండేళ్లు కాకముందే విడిపోయారు. పవన్ కల్యాణ్, రేణూదేశాయ్‌కు విడాకులు ఇచ్చి మూడో వివాహం చేసుకున్నారు.

Also Read : Vishwak Sen : ‘మెగా పవర్ స్టార్‌’తో ‘మాస్ కా దాస్’.. వైరల్ అవుతున్న ఫొటో..

అక్కినేని నాగార్జున దగ్గుబాటి లక్ష్మీకి విడాకులు ఇచ్చి అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చారు. శరత్ బాబు, రమాప్రభలు విడిపోయారు. రాధిక ప్రతాప్ పోతన్ తో విడిపోయి శరత్ కుమార్ ను పెళ్లాడారు. ప్రకాష్ రాజ్ నటి లలితా కుమారికి విడాకులు ఇచ్చి, పోనీవర్మను పెళ్లాడారు. కమల్ హాసన్ కూడా ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. సినీనటి, యాంకర్ ఝాన్సీ కూడా జోడినాయుడికి విడాకులు ఇచ్చింది.