Vishwak Sen : ‘మెగా పవర్ స్టార్‌’తో ‘మాస్ కా దాస్’.. వైరల్ అవుతున్న ఫొటో..

మాస్ కా దాస్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ని కలిశారు.

Vishwak Sen : ‘మెగా పవర్ స్టార్‌’తో ‘మాస్ కా దాస్’.. వైరల్ అవుతున్న ఫొటో..

Vishwak Sen Meets Ram Charan Photo Goes Viral

Updated On : November 8, 2023 / 7:24 AM IST

Vishwak Sen : ఒక హీరో ఇంకో హీరోతో కలిసి ఫోటోలు దిగితే అవి బాగా వైరల్ అవ్వాల్సిందే. ఇటీవల మన హీరోలు ఇంకో హీరోలతో కలిసి దిగిన ఫోటోలు రెగ్యులర్ గా ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. దీంతో అభిమానులు సంతోషిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరి హీరోల ఫొటో వైరల్ గా మారింది.

మాస్ కా దాస్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ని కలిశారు. ఇటీవల ఓ ప్రాముఖ్య వ్యాపారవేత్తకు చెందిన క్లబ్ ఓపెనింగ్ కి పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. ఈ ఈవెంట్ నుంచే వెంకటేష్, మహేష్ బాబు.. మహేష్, చరణ్ ఫ్యామిలీలు కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికే బయటకి వచ్చి వైరల్ అయ్యాయి.

Also Read : Santosham Awards : 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్.. ఈసారి ఘనంగా గోవాలో..

తాజాగా ఇదే ఈవెంట్ నుంచి రామ్ చరణ్ తో విశ్వక్ సేన్ దిగిన ఫొటో బయటకి వచ్చింది. విశ్వక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫొటో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే విశ్వక్ నందమూరి అభిమాని, ఎన్టీఆర్ అభిమాని అని ప్రమోట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫొటో షేర్ చేయడంతో మెగా అభిమానులు కూడా సంతోషిస్తూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.