Ukrainian forces break through Russia front lines in the east and retake key towns
Russia-Ukraine War: ఏడు నెలలుగా సాగుతున్న భీకర యుద్ధంలో తొలిసారి రష్యాపై ఉక్రెయిన్ పై చేయి సాధించింది. ఉక్రెయిన్ సేనల మెరుపు దాడులతో రష్యా సేనలు తోక ముడిచాయి. ఎంతలా అంటే, ఉక్రెయిన్ దాడికి తట్టుకోలేక రష్యా సేనలు ఎక్కడి ఆయుధాలు అక్కడే వదిలేసి పారిపోయారు. దీంతో రాజధాని కీవ్ తర్వాత పెద్ద నగరంగా భావించే ఖార్కీవ్పై ఉక్రెయిన్ పట్టు సాధించింది. తాజా పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు.
రష్యా ఆక్రమిత ఖార్కివ్ నగరంలోని తూర్పు ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించిన మాస్కో.. ముఖ్యమైన ఇజియం సహా ఖార్కివ్‌ల నుంచి తన సేనలను హుటాహుటిన వెనక్కి మళ్లించింది. దీంతో ఈ యుద్ధం కీలక మలుపు తిరిగినట్టేనని ఉక్రెయిన్ పేర్కొంది. నిజానికి యుద్ధం ప్రారంభమైన ఈ ఏడు మాసాల కాలంలో ఉక్రెయిన్ దళాలు రష్యాను నిలువరించేందుకు అహోరాత్రులు శ్రమించాయి. ముఖ్యంగా రాజధాని కీవ్‌ను ఆక్రమించుకోకుండా ఉక్రెయిన్ సైన్యం పరిశ్రమించింది. ఈ క్రమంలో తాజాగా రష్యా సైన్యం వెనక్కి మళ్లడం గొప్ప విజయమని ఉక్రెయిన్ పేర్కొంటోంది.
అయితే కింద పడ్డా పై చేయి మాత్రం తనదే అన్నట్లు రష్యా చెప్పుకుంటోంది. ఒక చోట బలం పెంచుకోవాలంటే మరొక చోట బలాన్ని తగ్గించాల్సి వస్తుందన్నట్టుగా దక్షిణ ప్రాంతంలోని డోనెట్స్క్ ప్రాంతంలో తమ బలగాలను బలోపేతం చేసేందుకే ఖార్కీవ్ సహా తూర్పు ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఇక ఖార్కీవ్ మళ్లీ ఉక్రెయిన్ వశమవడంపై ఉక్రెయిన్ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
Queen Elizabeth : ప్రిన్స్ ఫిలిప్‌ను పెళ్లిచేసుకున్న చర్చిలోనే క్వీన్ ఎలిజబెత్ ఆఖరి మజిలీ