ట్విట్టర్ లో అమీ అనే విద్యార్ధి.. శుక్రవారం (నవంబర్ 1, 2019)న ఓ అద్భుతమైన వీడియో షేర్ చేస్తూ.. మా ప్రొఫెసర్ ని చూసి నాకు ఏడుపొచ్చేసింది. ఆయన మాకోసం ప్రతీ వారం బొమ్మలు తెస్తున్నారు. అని తెలిపింది. ఇంతకీ ప్రొఫెసర్ ఎందుకు వారికోసం బొమ్మలు తెస్తున్నారు. ఆయనకు అంత అవసరమేంటి.. అని ఆలోచిస్తున్నారా..? మరి అసలు విషయమేంటో ఆ వీడియో చూసి తెలుసుకుందాం.
అమీ తను చదువుకునే యూనివర్సిటీలో ఖుయెన్ దీ అనే ప్రొఫెసర్ ప్రతీ వారం క్లాస్ రూమ్ కు టాయ్స్ తెస్తున్నారని తెలుపుతూ.. ఆయన అలా ఎందుకు చేస్తున్నారో చెప్పింది. ఆ వీడియోలో ప్రొఫెసర్ తాను తెచ్చిన బ్యాగ్ లో నుంచి టాయ్స్ తీసి.. టేబుల్ పై పెడుతున్నారు. అయితే ఆ ప్రొఫెసర్ విద్యార్థులు బొమ్మలు ఎందుకిచ్చారంటే.. క్లాస్ లో ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో.. వారికి ఆ బొమ్మలను గిఫ్టుగా ఇస్తున్నారట.
అలా చేస్తే పిల్లలు పొటాపోటిగా చదువుతారని ఆయన బొమ్మలు ఇస్తున్నారట. ఈ వీడియోని అదే యూనివర్శిటీలో చదివిన ఒకప్పటి విద్యార్థులు కూడా చూశారు. ఆ ప్రొఫెసర్ తమకు కూడా అలాంటి గిఫ్టులు ఇచ్చేవారని తెలిపారు.
ఇక ఈ వీడియో పై చాలా మంది తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ 8 సెకండ్ల వీడియోను రోజుకు 17 లక్షల మందికి పైగా చూస్తున్నారు. ఇప్పటికే దానికి 6.8 లక్షల లైక్స్ వచ్చాయి. కొంతమంది ఆ వీడియోని గిఫ్‌గా మార్చి షేర్ చేస్తున్నారు. మరి ఆ వీడియోను మనం కూడా ఒకసారి చూసేద్దామా.
i’m crying ? my viet professor brings us stuffed animals every week to reward us for our hard work pic.twitter.com/E8JEY3zcHW
— amy (@lilmcnugs) October 31, 2019