Green Card : గ్రీన్ కార్డ్ కావాలా రాజా.. ముందు మీ దేశం వెళ్లిపో.. ట్రంప్ కొత్త రూల్..
Green Card : అమెరికాలో గ్రీన్ కార్డు కోసం కలలు కనే వారికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. కొత్త రూల్ ప్రకారం ముందు అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లిపోవాలి. ఆ తర్వాత గ్రీన్ కార్డు కోసం అప్లయ్ చేయాలి. అయితే, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రం దీనికి వెసులుబాటు ఉంది.
- Harish Thanniru
- Published on- May 23, 2026 / 12:17 PM IST
Green card
Green Card : అమెరికాలో గ్రీన్ కార్డు కోసం కలలు కనే వారికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. అమెరికాలో గ్రీన్ కార్డు కావాలంటే ముందే ఆ దేశం నుంచి వాళ్ల దేశాలకు వెళ్లిపోయి.. ఆ తర్వాత తమకు గ్రీన్ కార్డు కావాలంటూ అప్లయ్ చేసుకోవాలని కొత్త రూల్ తెచ్చారు. దీంతో గ్రీన్ కార్డు ఆశావహులకు పెద్ద తలనొప్పి తయారైంది.
Also Read : Ivanka Trump : ఇవాంకా ట్రంప్‌ని లేపేయడానికి ప్లాన్.. పట్టుబడిన ఇరాన్ టెర్రరిస్ట్? అతని బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
గతంలో అమెరికాలో ఉన్న వాళ్లు (స్టూడెంట్ వీసా కావొచ్చు, H1B కావొచ్చు, ఇతర వీసాలు) ఆ దేశంలోనే ఉంటూ తమకు గ్రీన్ కార్డు కావాలని అప్లయ్ చేసుకునే వెసులుబాటు ఉండేది. దాన్ని అక్కడి ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. కానీ, కొత్త రూల్ ప్రకారం ముందు అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లిపోవాలి. ఆ తర్వాత గ్రీన్ కార్డు కోసం అప్లయ్ చేయాలి. అయితే, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రం దీనికి వెసులుబాటు ఉంది.
ఎవరెవరి మీద ప్రభావం ఉంటుంది?
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రభావం దాదాపు అన్నివర్గాల మీద ఉంటుంది. హెచ్ 1 బీ వీసా దారులు, అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు, డిపెండెంట్ వీసా మీద వెళ్లిన కుటుంబ సభ్యులు, ఎప్లాయిమెంట్‌ని ఆధారంగా చేసుకుని గ్రీన్‌కార్డు అప్లయ్ చేసిన వారు. అమెరికాలో ఉంటూ ఆ దేశస్తులను పెళ్లి చేసుకునే వారు.
ఇది ఎందుకు తీసుకొచ్చారు?
అమెరికన్ వీసా రూల్స్‌లో చాలా లొసుగులు ఉన్నాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ రూల్స్‌ని కఠినతరం చేయాలని భావిస్తోంది. దీని వల్ల వలసలకు బ్రేక్ పడుతుంది. వ్యవస్థలో ఉన్న లొసుగులు వాడుకోవడానికి వీలుండదు. కుప్పలు తెప్పలుగా వచ్చిపడే అప్లికేషన్లను ప్రాసెస్ చేయడం అక్కడి ఉద్యోగులకు తలకుమించిన భారం. ఇప్పుడు ఆ పని కొంత తగ్గుతుంది.
దీనివల్ల తలెత్తే సమస్యలు ఏంటి?
ఈ కొత్త రూల్ వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కుటుంబాలు వేరు పడాల్సిన పరిస్థితి వస్తుంది. గ్రీన్ కార్డు వెయిటింగ్ టైమ్ విపరీతంగా పెరుగుతుంది. వీసా ఇంటర్వ్యూల్లో జాప్యం జరగొచ్చు. ట్రావెల్ ఖర్చులు పెరుగుతాయి. నిపుణులైన వారికి అన్యాయం జరగొచ్చు. అమెరికా నుంచి నిపుణులైన ఉద్యోగులు జాబ్స్ వదిలేసి కుటుంబాలతో సహా సొంత దేశాలకు వెళ్లిపోతే అది అమెరికాకే నష్టం. ఒక రకంగా అమెరికాలో రీ ఎంట్రీకి రిస్కే.
ట్రంప్ తెచ్చిన కొత్త రూల్స్ వల్ల అమెరికాలో ఉన్న ఇండియన్స్ మీద ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇండియన్స్‌లో చాలా మంది ఉద్యోగాలను ఆధారంగా చేసుకుని గ్రీన్ కార్డు కోసం అప్లయ్ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారు.
