×
Ad

Gun Fire: మూత్రం పోస్తుండగా ప్యాంటు జేబులో పేలిన గన్..పరిస్థితి ఎలా ఉందంటే..

ఓ వ్యక్తి టాయిలెట్ లో మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో ప్యాంటు జేబులో ఉన్న గన్ ఒక్కసారిగా పేలింది. దీంతో అతని పరిస్థితి..

  • Published On : October 8, 2021 / 05:40 PM IST

Gun Miss Fire In Pant Pocket

gun miss fire while man urinating i : ఓ యువకుడు టాయిలెట్ లో ప్రశాంతంగా మూత్రం పోసుకుంటున్నాడు. కానీ అప్పుడే ఊహించని ఘటన జరిగింది. అతని ప్యాంటు జేబులో ఉన్న ఘన ‘ఢాం’మంటూ పేలింది. ఇక అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.వినటానికి మనకు నవ్వు వస్తుంది గానీ పాపం అతని పరిస్థితి ఏం జరిగిందో ఊహించుకోండి…

న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో 39 ఏళ్ల వ్యక్తి టాయిలెట్‌కి వెళ్లాడు. ప్రశాతంగా మూత్రం పోసుకుంటున్నాడు. సరిగ్గా అతని ప్యాంట్‌లో బుల్లెట్లతో ఫుల్ లోడ్ లో ఉన్న గన్ ఒక్కసారిగా పేలింది.అదేంటీ ప్యాంటు జేబులో ఉన్న ఘన్ ట్రిగ్గర్ నొక్కకుండా ఎలా పేలింది? అనే అనుమానం వస్తుంది. కానీ అక్కడ జరిగిందేమిటంటే..మూత్రం పోసుకోవటానికి ప్యాంట్ తీసే క్రమంలో పొరపాటును గన్ ట్రిగర్ నొక్కాడు. దాంతో గన్ ఫైర్ అయ్యింది.

Read more : Gun Misfire : తుపాకీ మిస్ ఫైర్ – హోంగార్డు భార్య మృతి

బుల్లెట్ నేరుగా అతని కాలికి తగింది. ఇంకెక్కడ తగల్లేదు. దీంతో ప్రమాదం తప్పింది.లేదంటే ప్రాణం పోయేదే. తుపాకీ పేలుడుకి భారీ శబ్ధం రాగా.. టాయిలెట్‌లో ఉన్న మరో వ్యక్తి అక్కడి నుంచి భయంతో పరుగులు తీశాడు. ఆ తరువాత టాయిలెట్ లో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందించారు.

ఈ ఘటన గురించి..ప్రత్యక్ష సాక్షలు ఏం చెప్పారంటే..గ్రీన్ డ్రెస్ వేసుకన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. అక్కడే కొంతమంది వ్యక్తులతో మాట్లాడాడు. కాసేపటి తరువాత లైట్ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న మరో వ్యక్తి భయంతో బయటకు పరుగులు తీశాడు. దీంతో ఏదో జరిగిందని భావించిన స్థానికులు భద్రతా సిబ్బందికి..పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చూడగా..ఓ వ్యక్తి కాలికి బుల్లెట్ గాయంతో టాయిలెట్ లో ఫడి ఉండటం చూసి..అతడిని వెంటనే బెల్లే వ్యూ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Read more : Viral Video : గుడ్లు పెడుతున్న దోమ వీడియో..ఇంట్రెస్టింగ్ వీడియో