Iran War Cost 132 Billion Dollars : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ..! అమెరికా ఖజానాను కుదిపేసిన యుద్ధం.. 132 బిలియన్ డాలర్ల భారం

Iran War Cost 132 Billion Dollars : అమెరికా-ఇరాన్ ఘర్షణ. కేవలం కొన్ని వారాల పాటు సాగిన ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటికే 132 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11 లక్షల కోట్లకు పైగా) ఆర్థిక భారం మోపినట్లు పలు సంస్థలు అంచనా వేశాయి.

Iran War Cost 132 Billion Dollars

Iran War Cost 132 Billion Dollars : మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొన్ని వారాలపాటు కొనసాగిన ఉద్రిక్తతలు అమెరికాకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్ తో దాదాపు 107రోజుల పాటు కొనసాగిన యుద్ధం అమెరికా ప్రజలపై భారీ ఆర్థిక భారం మోపిందని ప్రముఖ మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు దాదాపు 132 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11లక్షల కోట్లకు పైగా) నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఇందులో కేవలం సైనిక వ్యయాలే కాకుండా ఇంధన ధరల పెరుగుదల, ముడి పదార్థాల ఖర్చులు, వడ్డీ రేట్ల పెరుగుదల వంటి పరోక్ష ప్రభావాలు కూడా ఉన్నాయి.

Also Read : Ambubachi Mela : అంబుబాచీ మేళాకు సిద్ధమైన అసోం.. ఆ మూడ్రోజులు బ్రహ్మపుత్ర నదిలో నీళ్లు ఎందుకు ఎరుపెక్కుతాయి.. ప్రత్యేకత ఇదే..

యుద్ధం కారణంగా అమెరికా వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై అదనంగా 60 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇరాన్ తో అమెరికా ఘర్షణకు ముందుతో పోల్చితే ఉద్రిక్తతల తరువాత ప్రతి అమెరికన్ కుటుంబంపై సగటున 460 డాలర్ల అదనపు భారం పడిందని నివేదిక పేర్కొంది. అంతేకాదు.. ఇరాన్ దాడుల కారణంగా వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్ జలసంధి క్లోజ్ కావడంతో అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ ధర ఉద్రిక్తతల ముందు ఉన్న 2.98డాలర్ల నుంచి ఇరాన్ తో వార్ తరువాత దాదాపు 4డాలర్లకు చేరుకుంది.

చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. ముడి పదార్థాలు, తయారీ ఉత్పత్తుల రవాణా ఖర్చులు పెరగడంతో వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అమెరికా కార్మిక గణాంకాల బ్యూరో (BLS) ప్రకారం.. గత నెలలో వినియోగదారుల ధరల సూచీ (CPI) నెలవారీగా 0.5 శాతం, వార్షికంగా 4.2 శాతం పెరిగింది. ఇంధన ధరలు ఒక్క నెలలోనే 3.9 శాతం పెరిగి మొత్తం ద్రవ్యోల్బణ పెరుగుదలలో 60 శాతానికి పైగా వాటా కల్పించాయి. ఆహార ధరలు కూడా వార్షికంగా 3.1 శాతం పెరిగాయి.

అమెరికా రక్షణ శాఖ గత నెల ప్రతినిధుల సభకు సమర్పించిన నివేదిక ప్రకారం.. ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ప్రత్యక్ష సైనిక వ్యయం 29 బిలియన్ డాలర్లు. అయితే ఇరాన్ దాడులతో దెబ్బతిన్న అమెరికా సైనిక స్థావరాల మరమ్మతు ఖర్చులు ఇందులో లెక్కించలేదని వెల్లడైంది. మధ్యప్రాచ్యంలో అమెరికా విమాన వాహక నౌకల మోహరింపు, సైనిక సిబ్బంది, ఆయుధాల నిర్వహణకు అయ్యే ఖర్చులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.