×
Ad

Burj Khalifa: ఇరాన్ మిస్సైళ్ల వర్షం.. ఆ భయంతో బుర్జ్ ఖలీఫా ఖాళీ

యూఏఈపై విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని అమెరికా ఎయిర్ బేస్ లే లక్ష్యంగా మిస్సైల్స్ వదులుతోంది.

  • Published On : February 28, 2026 / 08:19 PM IST

Representative Image (Image Credit To Original Source)

  • దుబాయ్ ను టార్గెట్ చేసింది ఇరాన్
  • దుబాయ్ పై మిస్సైళ్ల వర్షం
  • ముందస్తు జాగ్రత్తగా బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయిస్తున్న అధికారులు

 

Burj Khalifa: దుబాయ్ ను టార్గెట్ చేసింది ఇరాన్. దుబాయ్ పై ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా బుర్జ్ ఖలీఫాను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు దుబాయ్ ఎయిర్ పోర్టును మూసివేశారు. యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్ గా ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఇరాన్ కు యూఏఈ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ప్రతి దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

అమెరికా, ఇజ్రాయల్ దాడులతో ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. ఇందులో భాగంగా యూఏఈపై విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని అమెరికా ఎయిర్ బేస్ లే లక్ష్యంగా మిస్సైల్స్ వదులుతోంది. ఇదే క్రమంలో దుబాయ్ పైనా అటాక్స్ చేస్తోంది. దీంతో ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా నుంచి ఖాళీ చేయించారు. ఇరాన్ దాడి చేస్తుందన్న సమాచారంతో సైరన్లు మోగించారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

శనివారం దుబాయ్‌లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించిన తర్వాత తీవ్ర భద్రతా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించారు. ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు వేగంగా పెరుగుతున్నాయి.

తాము పెద్ద శబ్దాలు విన్నట్లు స్థానికులు తెలిపారు. అత్యవసర సేవలు సెంట్రల్ దుబాయ్, ఇతర సున్నితమైన ప్రాంతాలకు చేరుకున్నాయి. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణ గల్ఫ్ దేశాలకు మరింత విస్తరించొచ్చనే భయాలు పెరగడంతో అధికారులు యూఏఈ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా నుండి సందర్శకులను, సిబ్బందిని అధికారులు ఖాళీ చేయించారు. పోలీసులు చుట్టుపక్కల వీధులను దిగ్బంధించారు. ఈ పరిణామాలతో ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు.

గల్ఫ్‌లోని అమెరికా సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అనేక ప్రాంతాలలో సైరన్లు మోగించారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు.