Donald Trump : డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన.. సుంకం 25శాతానికి పెంపు.. ఆ దేశంపై ఆర్మీ ఆపరేషన్..
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. క్యూబాపై ఆర్మీ ఆపరేషన్ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.
- Harish Thanniru
- Published on- May 2, 2026 / 08:17 AM IST
Donald Trump
- అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక ప్రకటన
- క్యూబాపై సైనిక ఆపరేషన్
- ఈయూ కార్లపై సుంకం 25శాతానికి పెంపు
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. క్యూబాపై ఆర్మీ ఆపరేషన్ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ప్లోరిడాలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలోనే మా సైన్యం ఆపరేషన్ క్యూబా చేపట్టబోతుంది. మేము క్యూబాను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. అబ్రహం లింకన్ యుద్ధ నౌకను ఆ దేశానికి 100 గజాల దూరంలో ఆపుతాం. మేము లొంగిపోతున్నాం అని క్యూబా చెప్పేలా చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read : Weather Update : గుడ్‌న్యూస్.. మే నెలలోనే వచ్చేస్తున్నాయ్.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు..
అమెరికా – క్యూబా మధ్య వైరం కొత్తది కాదు. ఒరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. అయితే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే అమెరికా తీవ్ర ఆంక్షలతో క్యూబా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ట్రంప్ తాజా ప్రకటన ఇరు దేశాల మధ్య వైరం మరింత పెంచేలా కనిపిస్తోంది.
సుంకం 25శాతానికి పెంపు..
ఈయూ కార్లపై సుంకం 25శాతానికి పెంపు చేస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తమ దేశంతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయని ఐరోపా సమాఖ్య (ఈయూ) పై అదనపు సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈయూ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాన్ని 25శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
