అగ్ర రాజ్యాధినేత ట్రంప్ భారత్ పర్యటన సమయం దగ్గర పడుతోంది. మరి కొద్ది గంటల్లోనే ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇండియా గడ్డపై కాలు మోపనున్నారు. గతకొద్ది రోజులుగా ఇండియా రావటానికి ఉత్సాహంగా ఉన్నానని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ నెటిజన్లను అలరిస్తున్నారు.
ఇంతలో ఒక ఉత్సాహం వంతడైన నెటిజన్ బాహుబలిలోని సాహోరే బాహుబలి సాంగ్ ను మార్ఫింగ్ చేసి విడుదల చేశాడు. ప్రభాస్ ఫేస్ కు ట్రంప్ ఫేస్ అతికించారు. అలాగే మధ్యమధ్యలో కూతురు ఇవాంకా, కుమారుడు జూనియర్ డోనాల్డ్ ను మోసి నవ్వులు పూయించాడు. ట్రంప్ ఈ వీడియోను ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతాలో రీ ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గామారింది. 8 గంటల్లోసుమారు 20 లక్షల మంది వీక్షించారు.
ఈ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకోగా, ట్రంప్ కూడా ఈ వీడియోపై స్పందించాడు. భారతదేశంలో ఉన్న నా గొప్ప స్నేహితులని కలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ట్వీట్ చేశారు.
Look so forward to being with my great friends in INDIA! https://t.co/1jdk3AW6fG
— Donald J. Trump (@realDonaldTrump) February 22, 2020