×
Ad

US President Joe Biden : అందరి ముందు మోకాళ్లపై కూర్చున్న బైడెన్, ‘నో..నో..నేనలా కూర్చోనన్న కమలా హారిస్

అందరి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోకాళ్లపై కూర్చున్నారు. ఆయనను అలా చూసిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నవ్వుతూ నేను మాత్రం అలా కూర్చోను అన్నారు.

  • Published On : January 20, 2023 / 11:28 AM IST

Joe Biden in turn gets on his knees before the Golden State Warriors

US President Joe Biden : అందరి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోకాళ్లపై కూర్చున్నారు. ఆయనను అలా చూసిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నవ్వుతూ నేను మాత్రం అలా కూర్చోను అన్నారు. ఆమె మాటలకు నవ్వుపూసాయి. అమెరికా అధ్యక్ష భవనంలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమెరికా (America) బాస్కెట్‌ బాల్‌ జట్టు గోల్డెన్‌ స్టార్‌ వారియర్స్‌ను సత్కరిస్తున్న సమయం ఈ ఇంట్రెస్టింగ్ దృశ్యానికి సందర్భం చోటు చేసుకుంది.

మంగళవారం (జనవరి,2023) అమెరికా బాస్కెట్‌ బాల్‌ జట్టు గోల్డెన్‌ స్టార్‌ వారియర్స్‌ను అధ్యక్ష భవనంలో సత్కరించారు. ఈ సందర్భంగా సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వారితో కలిసి గ్రూప్ ఫోటో తీయించుకునే క్రమంలో బైడెన్ మోకాళ్లపై కూర్చున్నారు. అక్కడున్న వారంతా కలిసి గ్రూప్‌ ఫొటోకు సిద్ధమైన క్రమంలో ఫొటో ఎలా తీసుకోవాలన్న దానిపై కమలా హారిస్‌ (Kamala Harris)తో మాట్లాడుతూండగానే బైడెన్‌ చటుక్కున మోకాళ్లపై కూర్చున్నారు.

పక్కనే ఉన్న కమలా హారిస్ అది గమనించి నో..నో నేను మాత్రం అలా కూర్చోను అంటూ నవ్వేశారు. నవ్వుతూనే నేనలా చెయ్యబోనంటూ ‘నో’ అంటూ నవ్వేశారు. ఈ ఆసక్తికర ఘటనతో బైడెన్ తో సహా అందరూ నవ్వేశారు. అప్పుడే కెమెరా కూడా క్లిక్ మంది. బైడెన్ మోకాళ్లపై కూర్చుని ఉండగా అందరూ నవ్వుతున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.