స్కూల్ టీచర్ కన్నా తక్కువ టాక్స్ కట్టారు. ట్రంప్‌పై బైడెన్ ఫైర్

  • Publish Date - September 30, 2020 / 12:41 PM IST

us presidential election 2020 : డొనాల్డ్, జో బైడెన్ మధ్య తొలి అధ్యక్ష ఎన్నికల చర్చ.. రచ్చ..రచ్చ. మెగా ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో, మరోసారి ఎన్నిక కావడానికి ట్రంప్ ఎన్నెన్ని వేషాలు వేయబోతున్నారో, బైడెన్ ఎలా కౌంటర్ చేయబోతున్నారో రుచిచూపించారు.

35 రోజుల్లోనే  అధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. President Donald Trump, డెమోక్రాటిక్ ప్రత్యర్ధి మొదటి రౌండ్ చర్చలో పాల్గొన్నారు. హ్యాండ్ షేక్ ల్లేవు. కోవిడ్ రూల్స్ ను బట్టి, ఇద్దరూ దగ్గరకెళ్లలేదు. ఇప్పటికే ఉప్పు, నిప్పులా ఉన్న ఇద్దరు నేతలు, ఏకంగా శత్రువుల్లాగానే కనిపించారు.


90 నిమిషాల లైట్ టెలివిజన్ డిబేట్‌కు ముందే joe biden వేల కోట్ల ట్రంప్, ఏళ్లతరబడి పన్నులు కట్టలేదని ఆరోపించారు. సహజంగానే డిబేట్‌లోనూ ఇదే అంశంతో ట్రంప్‌ను ఇరుకునపెట్టాలనుకున్నారు. టీచర్ కట్టిన పన్నులనూ, ట్రంప్‌లాంటి బిలియనీర్ కట్టలేదన్నారు.

Joe Biden ఏకంగా Donald Trumpని విదూషకుడిని వ్యాఖ్యానించారు. ఈ జోకర్ ఏం చెబుతున్నాడో మీకు అర్ధమవుతోందా అని అమెరికన్స్ ను ప్రశ్నించాడు బైడెన్. అంతలోనే, నువ్వు నోరు ముస్తావా? అంటూ ట్రంప్ మీద చికాకు పడ్డాడు.



న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన న్యూస్ రిపోర్ట్‌పై అడిగినప్పుడు, ట్రంప్, ప్రతియేడూ 750 డాలర్లు చొప్పున తాను పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ కట్టినప్పుడు బదులిచ్చారు. ఒక్క ట్రంప్ తప్ప, అమెరికా అధ్యక్షులందరూ, తామెంత టాక్స్ లు కట్టామో జనం ముందుంచారు.

అందుకే, టాక్స్ కోడ్‌ను ఎడ్వాంటేజ్‌ను వాడుకున్నారు. స్కూల్ టీచర్ కన్నా donald trump taxes కట్టారని ఎద్దేవా చేశారు బైడెన్.

దానికి ట్రంప్ బదులిచ్చారు. బుర్రతక్కువ వాళ్లు తప్ప ప్రతి బిజినెస్ లీడర్లు అలాగే చేస్తారని అన్నారు.